Begin typing your search above and press return to search.

ఉద్యోగం పేరిట సీనియర్ జర్నలిస్టుకే మోసం

By:  Tupaki Desk   |   16 Jan 2021 11:30 PM GMT
ఉద్యోగం పేరిట సీనియర్ జర్నలిస్టుకే మోసం
X
ఆమె ఒక సీనియర్ జర్నలిస్టు.. ఒకే మీడియా సంస్థలో ఏకంగా 21 ఏళ్లపాటు పనిచేశారు. సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఎన్నో చూసి ఉంటారు. ఆన్ లైన్ ఫ్రాడ్ లపై ఉపన్యాసాలు దంచారు. అయినా కూడా దారుణంగా మోసపోయారు.హార్వర్డ్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగమంటూ ఆన్ లైన్ ద్వారా దారుణంగా మోసం చేశారు.

నిధి రజ్దాన్ అనే మహిళ జర్నలిస్టు 1999 నుంచి 21 ఏల్ల పాటు ఎన్డీటీవీలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది తర్వాత తాను కెరీర్ మారుతున్నానని.. హార్వర్డ్ వర్సిటీలో జర్నలిజం అసోసియేట్ ప్రొఫెసర్ గా చేరబోతున్నానని 2020 జూన్ 13న ఆమె ట్వీట్ చేశారు. హార్వర్డ్ ఉద్యోగం కోసమని ఏకంగా ఆమె ఎన్డీటీవీలో ఉద్యోగాన్ని సైతం మానేశారు.

అయితే ఆన్ లైన్ ద్వారా ఈమెను నమ్మించి కొందరు మోసం చేశారు. హార్వర్డ్ వర్సిటీ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదని తెలుసుకున్న నిధి మోసపోయానని తెలుసుకొని వారిపై చట్టపరంగా పోరాడుతానని ప్రకటించారు. తనదగ్గరున్న ఆధారాలను పోలీసులకు అందజేస్తానన్నారు.

మోసగాళ్లు నిధిని తెలివిగా ఫోర్జరీ డాక్యుమెంట్లతో తనను మోసం చేశారని.. తన వ్యక్తిగత సమాచారంతోపాటు తన డివైజ్ లు, ఈమెయిల్ , సోషల్ మీడియా అకౌంట్లలోకి యాక్సెస్ పొందారని నిధి తెలిపారు. హార్వర్డ్ లో అసలు జర్నలిజం విభాగమే లేదని నిధికి తెలిసింది.

ప్రఖ్యాత జర్నలిస్టు నిధి మోసపోయానని ప్రకటించగానే ట్విట్టర్ లో 'హార్వర్డ్', ఎన్డీటీవీ ట్రెండ్ అయ్యాయి. 'నిధి వెంట్ టు హార్వర్డ్' అనే హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఆన్ లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచించారు.