Begin typing your search above and press return to search.
రాగితో కరోనా వైరస్ కి చెక్ !
By: Tupaki Desk | 31 Oct 2020 2:30 AM GMTకరోనా మహమ్మారి జోరు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుంది. రోజురోజుకి మళ్లీ కరోనా వైరస్ తీవ్రత పెరిగిపోతుంది. దీనితో పలు దేశాల్లో మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత , పేస్ మాస్క్ అనేది అందరి జీవితాల్లో ఒక భాగంగా మారిపోయింది. అయితే , ప్రస్తుతం మార్కెట్లో రకరకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు కరోనా ను ఎదుర్కుకోవడమే కాకుండా నాశనం చేయగల మాస్కు ని అభివృద్ధి చేశారు. ఇప్పుడున్న మాస్కులు పరిమిత రక్షణ మాత్రమే కల్పిస్తాయని.. అవి గాలిని శుభ్రం చేసి వైరస్ ను కట్టడి చేయలేవని మస్సాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఈ మాస్క్‌లో ఓ మెష్ మాదిరిగా రాగి పొర ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. రాగిలో సహజంగానే యాంటీ వైరల్ లక్షణాలుంటాయి. వీటిని వాడేవారు ఊపిరి పీల్చి వదిలినప్పుడు ఇందులో మెష్ నుంచి గాలి ప్రసరిస్తుందని వివరించారు. ఈ గాలిలో వైరస్ ఉంటే.. ఈ మెష్‌లో అధిక ఉష్ణోగ్రత వల్ల నశిస్తాయని చెబుతున్నారు
సాధారణంగా స్టీల్, ప్లాస్టిక్ ఉపరితలాలపై కరోనా వైరస్ మూడు రోజులు వరకూ సజీవంగా ఉంటుంది. అదే రాగిపై కేవలం నాలుగు గంటల్లోనే ఈ వైరస్ నిర్వీర్యం అవుతుంది. రాగి ఉపరితలంపైకి కరోనా చేరగానే ఆ లోహంలోని విద్యుత్ చార్జ్ అణువులు వైరస్ లోని కొవ్వు పదార్థంపై దాడి చేస్తాయి. అప్పుడు వైర్‌స్ లోని డీఎన్ ఏ నాశనమవుతుంది. దాంతో వైరస్ పూర్తిగా చనిపోతుంది. సాధారణంగా రాగి పాత్రలు వైరస్, బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. రాగి పాత్రలలో నీళ్లు తాగితే మంచిదని ఆయుర్వేదం కూడా చెప్తోంది. అయితే ఒకప్పటి ఈజిఫ్టియన్లు నీళ్లను రాగి పాత్రలలో ఉంచడం వల్ల అవి ఫ్రెష్ గా ఉంటాయని నమ్మేవాళ్లు. సైన్స్ ప్రకారం రాగి పాత్రలు ఫుడ్ పాయిజినింగ్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.
అమెరికాలోని పాత ఇళ్లలో ఇప్పటికీ రాగి వాటర్ పైప్ లైన్లే ఉన్నాయి. బాడీలో మెటబాలిజం పెరగడానికి కొన్నిరకాల మినరల్స్ అవసరమవుతాయి. ఐరన్ , జింక్, మెగ్నీషియం వంటివే కాకుండా కాపర్ కూడా అవసరమే. రాగి పాత్రలో నిల్వ ఉంచిన రెండు లీటర్ల నీళ్లను తాగితే మన శరీరానికి అవసరమైన దానిలో 40 శాతం కాపర్ పొందగలుగుతాం. ఇప్పటికీ నదుల్లో నాణేలు వేస్తారు. దాని వెనక ఉన్న సీక్రెట్ కూడా ఇదే. అప్పట్లో రాగి నాణేలు ఉండేవి. వాటిని నీళ్లల్లో వేయడం వల్ల ఆ నదుల్లో నీళ్లు తాగినవాళ్లకు కాపర్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. ఈ రాగి మాస్కులు ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వోద్యోగులు, సామాజిక దూరం పాటించటం వీలు కాని విధుల్లో ఉన్న సిబ్బందికి ఈ మాస్కులు అత్యంత ఉపయోగమని అమెరికా నిపుణులు చెప్తున్నారు.