Begin typing your search above and press return to search.
స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన ఇద్దరు మహిళలకు తనిఖీ.. కట్ చేస్తే?
By: Tupaki Desk | 6 Jun 2021 11:30 AM GMTసినిమాలోని సీన్ కు ఏ మాత్రం తీసిపోని ఉదంతం ఒకటి తాజాగా చెన్నైలోని ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. ఏ మాత్రం అనుమానం రాకుండా ప్లాన్ చేసిన ఈ ఉదంతానికి సంబంధించిన వచ్చిన ఒక రహస్య సమాచారం భారీ డ్రగ్ నిల్వల్ని పట్టుకునేలా చేసింది. దీని విలువ బహిరంగ మార్కెట్ లో ఏకంగా రూ.70 కోట్లు కావటం గమనార్హం. దాదాపు పది కేజీలు (సరిగ్గా చెప్పాలంటే 9.8 కేజీలు) ఉన్న హెరాయిన్ ను చెన్నై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిజానికి ఈ ఉదంతాన్ని చూస్తే ఏ మాత్రం సందేహం కలగకుండా స్క్రీన్ ప్లేను సిద్ధం చేశారు. దక్షిణాఫ్రికా నుంచి చెన్నైకు ఇద్దరు మహిళలు ప్రత్యేక విమానంలో వచ్చారు. వీల్ చైర్ లో ఉన్నమహిళకు మరో మహిళ సహాయకురాలిగా ఉన్నారు. వీల్ చైర్ మహిళకు వైద్య సేవలు అవసరమన్న పత్రాలు ఉన్నాయి. అందులోని పత్రాల ప్రకారం వారు ఢిల్లీలో చికిత్స పొందాల్సి ఉంది. దోహా నుంచి వారు చెన్నైలోని మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ముందస్తుగా అందిన సమాచారంతో పాటు.. ప్రత్యేక విమానంలో వైద్య సేవల కోసం వచ్చిన వారి సామాగ్రిని కస్టమ్స్ విభాగపు అధికారులు తనిఖీ చేశారు. అందులో నాలుగు పార్శిళ్లలో 9.8 కేజీల హెరాయిన్ బయటపడింది. వీటి విలువ ఏకంగా రూ.70 కోట్లు ఉండటంవిస్మయానికి గురి చేసింది. భారీ సెటప్ తో ప్రత్యేక విమానాన్ని సెట్ చేసుకొచ్చినప్పటికి డగ్ర్ దందాను పట్టుకోవటాన్ని పలువురు అభినందిస్తున్నారు.