Begin typing your search above and press return to search.
ఈమె ఫోటోను జాగ్రత్తగా చూడండి.. ఇంకొకరు మోసపోకుండా ఉండే ఛాన్సు
By: Tupaki Desk | 28 May 2022 11:30 PM GMTచూసినంతనే ఎలాంటి అనుమానం కలుగకుండా ఉండటమే కాదు.. ఆమె మాటల్ని విన్నంతనే ఫ్లాట్ అయ్యేలా ఉంటుంది. మంచిగా మాట్లాడుతూ పెళ్లి ముగ్గులోకి తీసుకొచ్చి.. అడ్డంగా బుక్ చేసే ఈ కిలేడీ గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఒకరికి తెలీకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోవటమే కాదు.. విడాకులు ఇవ్వకుండా మోసం చేసే ఈవిడ లీలలు వింటే.. ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అన్న సందేహం కలుగక మానదు.
ఆస్తి కోసం వరుస పెట్టి పెళ్లి చేసుకునే ఈ కిలేడీ పాపం పండింది. ఆమె మోసం బట్టబయలైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన శిరీష రియల్ స్టోరీ తెలిస్తే.. వెబ్ సీరిస్ కు ఏ మాత్రం తీసిపోనంత కంటెంట్ దొరకటం ఖాయం. ఈమె చేసే తప్పుడు పనులకు కథ.. స్క్రీన్ ప్లే.. దర్శకత్వాన్ని శిరీష తల్లి మేరమ్మ నిర్వహిస్తుండటం గమనార్హం.
నంద్యాల మండలం మిట్నాల గ్రామానికి చెందిన మేరమ్మ కుమార్తె శిరీష. ఆమెకు తొలుత జిల్లాలోని అవుకు మండలానికి చెందిన మల్లికార్జున రెడ్డితో పెళ్లైంది. అతనితో కలిసి ఉంటూనే.. విడాకులు తీసుకోకుండా.. ఎవరికి తెలీకుండా అవుకు గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డిని రెండో పెళ్లి చేసుకుంది.
అక్కడితో కూడా ఆగని ఆమె.. తాజాగా బేతంచర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డిని ఈ ఫిబ్రవరి ఐదున పెళ్లాడింది. తనకు గతంలో పెళ్లై.. పిల్ల ఉందని నమ్మించి..వారి పేరు మీద రూ.5లక్షలు డిపాజిట్ చేయాలని కోరింది. దీంతో.. మహేశ్వర రెడ్డి తన భార్యగా భావించి శిరీష పేరు మీద రూ.5లక్షలు డిపాజిట్ చేశారు. రెండు నెలలు అయ్యాయో లేదో.. తన కుమార్తె పేరు మీద ఆస్తి మొత్తం రాసివ్వాలని.. లేకుంటే ఆమెను కాపురానికి పంపనంటూ పంచాయితీ పెట్టింది మేరమ్మ.
ఇదెక్కడి లెక్కరా సామి అంటూ సందేహానికి గురైన మహేశ్వర్ రెడ్డి.. అసలు శిరీష ఫ్యామిలీ గురించి ఆరా తీయటం మొదలెట్టారు. దీంతో.. తనకు ముందు రెండు పెళ్లిళ్లు జరిగిన వైనంతో పాటు.. వారిద్దరికి విడాకులు ఇవ్వకుండానే తనను పెళ్లి చేసుకున్న విషయం గురించి తెలుసుకొని కంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి.. శిరీషను.. ఆమె తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో మరో కొసమెరుపు ఏమంటే.. ఇప్పటికే ముగ్గురిని మోసం చేసిన శిరీష నాలుగో పెళ్లికి సిద్ధం కావటం.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న వైనం తెలుసుకున్న పోలీసులు.. ఈ తల్లీకూతుళ్ల తీరుకు అవాక్కు అవుతున్నారు.