Begin typing your search above and press return to search.
స్పెయిన్‌లో లాక్‌డౌన్‌కు చెక్.. పార్టీ చేసుకున్న ప్రజలు
By: Tupaki Desk | 11 May 2021 12:30 AM GMTనిన్న మొన్నటి వరకు కరోనాతో అల్లాడిన స్పెయిన్‌లో దాదాపు అర్ధ సంవత్సరం పాటు లాక్‌డౌన్ విధించా రు. దీనిని అత్యంత కఠినంగా అమలు చేశారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇలా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంతో ఎట్టకేలకు కరోనా తీవ్రత తగ్గిపోయింది. ఇటీవల చైనాలోనూ కరోనాలేకపోవడంతో ఏకంగా వైరస్ పుట్టుకు ప్రాంతమైన వూహాన్‌లోనే ప్రజలు పండగ చేసుకున్నారు. అలానే.. స్పెయిన్‌లోనూ కోరనా వ్యాప్తి, తీవ్రత తగ్గిపోయిందని నిర్ధారించడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌కు స్వస్తి చెప్పింది.
పండగే పండగ!
స్పెయిన్ సర్కారు లాక్‌డౌన్ సమయంలోనే కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టింది. అంతేకాదు.. వైరస్ వ్యాప్తిని ఎప్పటికప్పుడు పరిశీలించింది. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి తగ్గడంతో ఎట్టకేలకు ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది. అంతే.. ఒక్కసారిగా పంజరంలో చిక్కుకున్నప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చారు. వందల కొద్దీ జనం వీధుల్లో సెలబ్రేషన్స్, పార్టీలు జరుపుకున్నారు. మాడ్రిడ్ సెంట్రల్ ప్యూయెర్టా డెల్ సొల్ స్క్వేర్ ప్రాంతంలో మాస్కులు లేకుండా డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. మహమ్మారి వ్యాపించక ముందు జరిపిన నైట్ లైఫ్ ను గుర్తు చేసుకుంటూ సెలబ్రేషన్స్ జరిగాయి. చాలా మంది చేతుల్లో డ్రింక్ బాటిళ్లతో కనిపించారు.
కఠిన నిబంధనలు!
స్పెయిన్ లో 17 రీజనల్ గవర్నమెంట్స్ హెల్త్ కేర్ పై ఫోకస్ పెట్టింది. పరిమితమైన స్వాతంత్ర్యం మాత్రమే ఇచ్చింది. నైట్ టైం కర్ఫ్యూలు, అత్యవసరం లేని ప్రాంతాలకు ప్రయాణాన్ని నిషేదించింది. క్రిష్టమస్ కోసం కొద్ది రోజులు మాత్రమే నిబంధనలు ఎత్తేసినా.. ఇతర ప్రాంతాలకు సెలవుపై, కుటుంబాలను చూడటానికి అనే కారణాలతో వెళ్లకూడదని ఆదేశించింది.
79 వేల మంది మృతి
యూరప్ లో మహమ్మారి కారణంగా బలైన దేశాల్లో స్పెయిన్ ఒకటి. 35 లక్షల మందికి ఇక్కడ వైరస్ సోకింది. 79వేల మంది చనిపోయారు. దీంతో కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేశారు.