Begin typing your search above and press return to search.

పచ్చిమిర్చితో షుగర్ కు చెక్

By:  Tupaki Desk   |   22 March 2020 5:30 PM GMT
పచ్చిమిర్చితో షుగర్ కు చెక్
X
మారుతున్న కాలానికి అనుగుణంగా రోజురోజుకు కొత్తకొత్త వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇందులో షుగర్(డయాబెటిక్) ఒకటి. డయాబెటిక్ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోకపోతే గుండెజబ్బులు వంటి వచ్చే ప్రమాదం ఉంది. భారతదేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. అయితే తాజాగా షుగర్ పేషంట్లకు నిపుణులు ఓ గుడ్ న్యూస్ తెలిపారు. ఆహారంలో పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని అరికట్టవచ్చని తాజా పరిశోధనలో వెల్లడయింది.

పచ్చిమిర్చి షుగర్ పేషెంట్లను సంజీవనిలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పచ్చిమిర్చి రక్తంలోని చక్కెర నిల్వలను అదుపులో ఉంచుతుంది. పచ్చిమిర్చిలో పోషకాలు, విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. దీనిని రెగ్యులర్‌గా తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్ ఏ, కాపర్, విటమిన్ బీ6, ఐరన్ నియాసిన్, పొటాషయం, ఫైబర్ ఫోలేట్ కూడా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషణను అందిస్తుంది. పచ్చిమిర్చిని తిన్న తర్వాత శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అయి రక్తంలో డయాబెటీస్ లెవల్స్ 60శాతం తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పచ్చిమిర్చిని ఆహారంలో తీసుకోవడం ద్వారా ఇతర లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. పచ్చిమిర్చి లో కేప్సైసిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని మెటాబాలిజాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తుంది. వీటిని తినడం వల్ల శరీరంలోని కొవ్వు కంట్రోల్లో ఉంటుంది. మెటబాలిక్ రేట్ పెరిగి ఎటువంటి వ్యాయామం చేయకుండానే బరువు తగ్గుతారు. అజీర్తిని తగ్గించి జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది. రక్త స్రావం తగ్గుతుంది. పక్షవాతం వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

కీళ్ల నొప్పులను తగ్గించడంలో మిరప భేషుగ్గా పనిచేస్తుంది. దెబ్బ తగిలినప్పుడు కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తి కారానికి ఉందట. జలుబు, దగ్గు, ఫ్లూ, ముక్కు దిబ్బడను మిర్చిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తగ్గిస్తాయి. ఇందులోని విటమిన్ ఎ, సిలు.. చర్మానికి, కళ్లకు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. పచ్చిమిర్చి క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షణగా ఉంటాయి. ప్రొస్టేట్ గ్రంథి సమస్యలకూ పచ్చిమిర్చి చెక్ పెడుతుంది. పచ్చిమిర్చి తిన్న తర్వాత మూడు గంటల పాటు మన శరీరంలో ఆ ప్రభావం ఉంటుంది.

మన పూర్వీకులు ఉదయాన్నే సద్దన్నంలో ఉల్లి, పచ్చిమిర్చిని చేర్చుకుని తినేవారు. చద్దన్నం ఒంటికి చలువ, అలానే ఉల్లి కూడా. అందుకే వారు ఆ రోజుల్లో ఎలాంటి రోగాలు లేకుండా వందేళ్లు హాయిగా జీవించారు. ప్రస్తుతం ప్రతీఒక్కరూ కాసింత కారానికే భయపడుతుంటారు. అనేక పోషక విలువున్న పచ్చిమిర్చిని ఆహారంలో తీసుకుంటే సగానికి పైగా జబ్బులకు దూరంగా ఉండొచ్చు. కావున ఇకనైనా ప్రతీఒక్కరూ ఆహారంలో తగినంత పచ్చిమిర్చిని తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.