Begin typing your search above and press return to search.

చీ..చీ.. నాకు అలాంటి భాష రానేరాదంటున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   14 Feb 2022 3:51 AM GMT
చీ..చీ.. నాకు అలాంటి భాష రానేరాదంటున్న కేసీఆర్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజ‌కీయాల గురించి, ఆయ‌న ఉప‌యోగించిన భాష‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అద‌లాఉంచితే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్ప‌దం కావ‌డం, ఆ కామెంట్ల‌పై కేసీఆర్ స్పందించడం తెలిసిన సంగ‌తే.

అయితే, తాజాగా మ‌రోమారు విలేక‌రుల స‌మావేశం సందర్భంగా రాహుల్ గాంధీపై చేసిన ఈ కామెంట్ల‌ను సీఎం కేసీఆర్ ఖండించారు. ఈ సంద‌ర్భంగా భాష గురించి, నాయ‌కుల కామెంట్ల గురించి కేసీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

కాంగ్రెస్ పార్టీని తాను సపోర్ట్ చేయడం లేదని పేర్కొన్న కేసీఆర్ రాహుల్ పై వేసిన నిందను మాత్రం ఖండిస్తున్నానని తెలిపారు. ``ఇదేం పద్దతి? అలా మాట్లాడొచ్చా. రాజకీయాల్లో అనుసరించాల్సిన పద్దతి కానే కాదు. ఇది ఖండనీయం.. సహించనీయం`` అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉద్యమ సమయంలో తాను సోనియాగాంధీపై అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ``నాకు అలాంటి భాషా రానే రాదు.

అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడే దుర్మార్గపు మాటలు నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ తరహా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి` అని కేసీఆర్ కోరారు. బీజేపోళ్లను తరిమి కొట్టకపోతే దేశం నాశనమవుతుందని కేసీఆర్ విరుచుక‌ప‌డ్డారు.

కాగా, రాహుల్ గాంధీపై కాంగ్రెస్ పార్టీ వాళ్ల కంటే సీఎం కేసీఆరే గొప్పగా సానుభూతి చూపిస్తున్నారని బీజేపీ సీనియ‌ర్ నేత‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎద్దేవా చేశారు.

పొత్తుల కోసమే సీఎం కేసీఆర్ పాకులాట అని ఆయన ఆరోపించారు. అన్నారు. మరి సోనియా గాంధీ, చంద్రబాబు లాంటి వాళ్లు.. ప్రధాని నరేంద్ర మోడీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కేసీఆర్ క‌ళ్ల‌ల్లో నీళ్లెందుకు రాలేదని ప్రశ్నించారు. భాష గురించి కేసీఆర్ మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని రఘునందన్ అన్నారు.