Begin typing your search above and press return to search.
రాజేంద్రనగర్‌లో మళ్లీ చిరుత కలవరం..ఆందోళనలో స్థానికులు
By: Tupaki Desk | 10 Oct 2020 9:10 AM GMTహైదరాబాద్ రాజేంద్ర నగర్ ప్రజలకు ఓ చిరుతపులి నిద్రలేకుండా చేస్తోంది. ఆ మధ్య వరుసగా నాలుగు రోజులు హల్ చల్ చేసిన చిరుత,ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే , చిరుత మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. రాత్రి చిరుత మళ్లీ వచ్చి వాలంతరీ ప్రాంతంలో రెండు లేగ దూడలపై పంజా విసిరింది. అంతా నిద్రపోతున్న సమయంలో ఈ దాడి జరిగింది. తెల్లారి చూస్తే లేగ దూడలు చనిపోయి కనిపించాయి. ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారా అని చూస్తే అక్కడ చిరుత కాళ్ల అచ్చులు కనిపించాయి. అంతే స్థానికుల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది.
ఈ విషయం పోలీసులకు, అటవీ అధికారులకూ చెప్పారు స్థానికులు. అక్కడకు వెళ్లిన పోలీసులు అచ్చులను చూసి ఎస్ ఇవి చిరుతపులివే అన్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇంతకీ ఆ చిరుత ఎక్కడి నుంచి వస్తోంది? రాజేంద్ర నగర్‌లోనే అది ఎందుకు తిరుగుతోందన్నది తెలియట్లేదు. రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాలు అడవి జంతువులకు ఆవాసాలుగా మారుతున్నాయి. వాలంతరిలోని రైస్ రీసెర్చ్ సెంటర్ సమీపంలో ఎక్కువగా చెట్లు, తుప్పలు ఉంటాయి. దాదాపు అడవిలా ఉంటుంది ఆ ఏరియా. అందువల్ల చిరుత అక్కడ తిరుగుతోందని అంటున్నారు.
ఆగస్టులో కూడా రాజేంద్రనగర్‌లో చిరుత సంచరించింది. ఆగస్టు 26న హిమాయత్‌సాగర్ వాలంతరీ రిసెర్చ్ ఫ్యూమ్ హౌస్ దగ్గర ఆవులపై దాడిచేసింది. ఒక ఆవుదూడను చంపి తిన్నట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. యజమాని అహ్మద్‌ఖాన్ తన ఆవును కాపాడుకోవడానికి డప్పు చప్పుడు చేయడంతో చిరుతపులి పారిపోయింది.ఇప్పుడా చిరుతను అధికారులు పట్టుకోకపోతే... ఏదో ఒక రోజు అది స్థానికులపై దాడి చేసే ప్రమాదం ఉంటుంది. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఆ చిరుతను అక్కడి నుంచి అడవిలోకి తరలించాల్సిన అవసరం ఉంది.