Begin typing your search above and press return to search.

తిరుమలలో చిరుతల సంచారం .. సీసీ కెమెరాలో దృశ్యాలు.. షాకింగ్ వీడియో !

By:  Tupaki Desk   |   19 May 2021 9:30 AM GMT
తిరుమలలో చిరుతల సంచారం .. సీసీ కెమెరాలో దృశ్యాలు.. షాకింగ్ వీడియో !
X
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన తిరుమల భక్తులు లేక వెలవెలబోతోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ , కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికి కూడా ఆలయాన్ని పూర్తిగా మూసివేయకుండా కరోనా ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తూ శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకి ఆ దేవదేవుడి దర్శన భాగ్యం కల్గిస్తున్నారు. అయితే , మొదటి వేవ్ తగ్గిపోయినా తర్వాత భక్తులు విరివిగా కొండపైకి వచ్చేవారు. కానీ, సెకండ్ వేవ్ మొదలు కావడంతో దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న వారు సైతం తమ ప్రయాణాలని వాయిదా వేసుకుంటుండటం తో రోజు కేవలం 5 వేల లోపు భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు.

ఈ తరుణంలో మరోసారి చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. తిరుపతి అలిపిరి సమీపంలో ఉన్న కపిల తీర్థం ఆలయ ఆవరణలో రెండు చిరుత పులులు కనబడ్డాయట. ఆలయ ప్రాంగణం లో కలియతిరుగుతూ సీసీ కెమెరాల్లో కనిపించాయట. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తో తిరుమలకి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం లేదు. జనసంచారం లేకపోవడంతో శేషాచల అడవుల్లోంచి చిరుతలు ఇలా ఆలయ ఆవరణ వైపు వచ్చాయని టీటీడీ సిబ్బంది చెప్పారట. అలాగే , సీసీ కెమెరాల్లో చిరుతలకు సంబంధించిన ఫుటేజ్‌ను కూడా పరిశీలించారు. అయితే తిరుమల లో చిరుతల సంచారం అనేది ఇప్పుడేమి కొత్త కాదు. కరోనా మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్ వేసిన తరవాత ఎలుగు బంట్లు, చిరుతలు ప్రత్యక్షం అయ్యాయి.. తిరుమలకు వచ్చే ఘాట్ రోడ్డులో జింకలు కూడా తిరిగాయి. భక్తులు నెలల పాటూ తిరుమలకు రాకపోవడంతో జంతువులు తిరుమల వీధుల్లో కూడా జంతువులు స్వేచ్ఛగా తిరిగాయి. అయితే , ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా భక్తుల రాకపోకలు తగ్గిపోవడం తో మళ్లీ జంతువులు స్వేచ్ఛగా బయటకి వస్తున్నాయని టీటీడీ సిబ్బంది చెప్తున్నారు.