Begin typing your search above and press return to search.
జోగయ్య కోసం కదిలిన కాపు దండు...
By: Tupaki Desk | 2 Jan 2023 1:39 PM GMTపశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ప్రారంభం కావాల్సిన దీక్ష భగ్నం కావడంతో ఇప్పుడు కాపు రాజకీయాలు ఏలూరు వైపు మళ్లాయి.. ఈ రోజు దీక్ష ప్రారంభించాల్సి ఉండగా ముందుగానే పోలీసులు అప్రమత్తమై మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్యను అరెస్టు చేసి ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో కాపు సంఘ నాయకులు మాట్లాడుతూ తమ నాయకుడికి ఏమైనా జరిగితే పోరాటాన్ని ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. నిన్న మధ్యాహ్నం జోగయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు వైద్య సిబ్బంది చేత ఆరోగ్య పరీక్షలు చేయించారు. అప్పటికే జోగయ్య మాట్లాడుతూ ఈ క్షణం నుంచే దీక్షను చేపడతున్నానని, తనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకుని ఏలూరు ఆస్పత్రికి తరలించి దీక్షను భగ్నం చేశారు.
ముందుగా అతి తక్కువ మంది సిబ్బంది జోగయ్య నివాసానికి చేరుకుని మంతనాలు జరిపారు. ఎంత సేపు సర్దిచెప్పినప్పటికీ జోగయ్య దీక్షకే కట్టుబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు జోగయ్య ఇంటి వద్ద భద్రతను మరింత పెంచి చివరకు 108 వాహనంలో జోగయ్యను ఏలూరు తరలించక తప్పలేదు.
ఒకానొక సందర్భంలో జోగయ్య స్వీయ నిర్బంధంలోకి వెళ్లి తన గదిలో తన అనుచరులతో కలిసి గదిని లాక్ చేసుకున్నారు. పోలీసులు ఒత్తిడి పెరిగిన కొద్దీ జోగయ్యలో మొండితనం మరింతగా కనిపించడంతో పోలీసుల్లో హై టెన్షన్ పెరిగింది. దీంతో ఒక పథకం ప్రకారం మరింత బందోబస్తు పెంచి అపార్ట్మెంట్ లో విద్యుత్ దీపాలు ఆర్పేసి ఒక్కసారిగా పోలీసులు జోగయ్యను బలవంతంగా ఎత్తుకొచ్చి అంబులెన్స్.లో ఎక్కించారు.
ఈ విషయం ఈ రోజు ఉదయానికి బయటపడటంతో కాపు సంక్షేమ సేన నాయకులు ఏలూరు బయల్దేరడానికి సిద్ధమయ్యారు. తమకు కేంద్రం కేటాయించిన రిజర్వేషన్ల కోసం పెద్ద వయస్సును సైతం లెక్కచేయకుండా హరిరామ జోగయ్య పోరాడుతుంటే ప్రభుత్వం అడ్డుపడటంపై కాపు సంక్షేమ సేన నాయకులు మండిపడుతున్నారు. తమ నాయకుడు జోగయ్యను కలిసేందుకు వెళ్తున్న తమను అదుపులోకి తీసుకోవడం సరికాదంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం కాపు సంక్షేమ సేన నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చేగొండి హరి రామ జోగయ్య అరెస్టు దారుణమని దీక్షకు మద్దతుగా వెళ్లడానికి పర్మిషన్ లేదని సెక్షన్ 30 అమలులో ఉందని తమను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.. జోగయ్యకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది కలిగిన రాష్ట్ర కాపు సంక్షేమ సేన తరఫున ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఆయన ఆరోగ్యం గురించి ఎలాంటి హెల్త్ బులెటెన్ విడుదల చేయలేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏలూరు ఆస్పత్రికి వస్తున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ పోలీసుల మధ్య కొంత తోపులాట చోటు చేసుకోవడంతో ఆయనను కూడా పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం హరిరామ జోగయ్యను కలిసేందుకు ఆస్పత్రిలో ఎవ్వరికీ అనుమతినివ్వడం లేదు. అసలే తుని ఘటనను గుర్తుకు చేసుకుంటున్న పోలీసులు ముందస్తుగానే అలర్ట్ అవుతున్నారు. మరో ఉద్యమం తలెత్తితే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనే భయంతో పోలీసులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. అందుకే ఏలూరు ఆస్పత్రిలో ఉన్న జోగయ్యను కలిసేందుకు ఎవ్వరికీ అనుమతివ్వడం లేదు. మరో వైపు వయస్సు మీద పడటంతో ఆయన మరింత నలిగిపోయే అవకాశం ఉంది. అందుకే ముందుగా ఆస్పత్రిలో ఉంచి ఆయనకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నారు. ఇటువంటి సమయాల్లో జరగరానిది జరిగితే ప్రభుత్వం నింద భరించాల్సి ఉంటుంది. అందుకే అధికారగణం ముందుస్తు ప్రణాళిక ప్రకారం తరలివస్తున్న కాపు నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.