Begin typing your search above and press return to search.
జోగయ్య పుస్తకం మరో స్వేచ్ఛాభారతం
By: Tupaki Desk | 2 Nov 2015 5:30 PM GMT పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్న కాలంలో ముఖం మీద కొట్టినట్లు, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతూ తరచూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ రాజకీయాల్లో కురువృద్ధుడైన చేగొండి హరిరామ జోగయ్య కొద్దికాలంగా రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. ఈ గ్యాప్ లో ఆయన రాసిన పుస్తకం తాజాగా పలు సంచలనాలకు కారణమవుతోంది. రాజకీయాల్లో విశేషానుభవం ఉండి.. స్వయంగా రాజకీయ ఉత్ధానపతనాలకు గురవడమే కాకుండా ఏపీ రాజకీయాల్లో ఎత్తుపల్లాలనూ చూసిన జోగయ్య అర్ధశతాబ్దానికి పైగా క్రియాశీల రాజకీయాలు చేసిన వ్యక్తిగా ఏపీ రాజకీయాలపై రాసిన పుస్తకం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీరామారావుకు అంకితమిచ్చిన ఈ పుస్తకంలో ఆయన.. ఇంతవరకు పనిచేసిన ముఖ్యమంత్రులను సమీక్షించడం... వారిలో మంచిచెడులు... ఎవరు ఎందులో గొప్ప.. ఎవరు ఎందులో వీక్ వంటి అంశాలతో పాటు గతంలో జరిగిన రాజకీయ హత్యలనూ ఆయన తన పుస్తకంలో ప్రస్తావించడంతో ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఎవరిని కదిపినా హరిరామజోగయ్య పుస్తకం గురించే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో 'చేగొండి' పుస్తకంలో ఏముందో ఒక్కసారి తెరిచి చూద్దాం. తాజాగా విడుదలైన ఈ పుస్తకంపై అప్పుడే పూర్తిస్థాయిలో చెప్పలేకపోయినా స్థూలంగా దీనిలోని అంశాలు ''తుపాకీ" పాఠకుల కోసం..
హరిరామ జోగయ్య ఆత్మకథ పుస్తకంలో ప్రధానంగా మూడు అంశాల గురించి చెప్పుకోక తప్పదు. అవినీతికి వ్యతిరేకంగా ఆయన నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వ్యక్తంచేయడం... ఏడెనిమిది మంది ముఖ్యమంత్రులతో తనకు ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో అప్పటి కాలంలో తాను సమీపంగా చూసిన రాజకీయ పరిణామాలను నిర్భీతిగా ఆయన చెప్పడం ఈ పుస్తకం ప్రత్యేకత. దీంతో పాటు ప్రస్తుత నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చదవదగ్గవే.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కాలేజీలో విద్యార్ది సంఘం నేతగా ఎన్నికవడం నుంచి హరిరామజోగయ్య ప్రజా జీవితం ప్రారంభమైంది. ఆ తరువాత ఆయన కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితుడై... అక్కడి నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఆ తరువాత మొన్నమొన్నటి వరకు ఆయన టీడీపీ, ప్రజారాజ్యం, వైసీపీ.. ఇలా వివిధ పార్టీలు మారారు. ఈ క్రమంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, రాష్ట్రంలో మంత్రిగానూ పనిచేశారు.
సమితి నుంచి లోక్ సభ వరకు..
సమితి అధ్యక్షుడి నుంచి జిల్లా పరిషత్ అధ్యక్షుడు, ఆ తర్వాత చిన్న వయసులోనే పాలకొల్లు శాసనసభ సభ్యుడు కావడం వంటివన్నీ జోగయ్య తన పుస్తకంలో వివరించారు. మాజీ మంత్రి పరకాల శేషావతారంతో అనుబంధం... ఆ తరువాత ఆయనతో విభేధించడం వంటివన్నీ జోగయ్య తన పుస్తకంలో ప్రస్తావించారు. కాసు బ్రహ్మానందరెడ్డి - జలగం వెంగళరావు - ఎన్.టి.రామారావు - మర్రి చెన్నారెడ్డి - విజయభాస్కరరెడ్డి - చంద్రబాబు నాయుడు - వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి ప్రముఖులతో తనకు ఉన్న సంబందాలు, విబేధాలు అప్పటి రాజకీయ పరిణామాలు, ఎత్తుగడలను జోగయ్య ఇందులో రాసుకొచ్చారు. అప్పట్లో కాసు బ్రహ్మానందరెడ్డి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్ధులు కొందరిని ఓడించడానికి జోగయ్యకు బాద్యత అప్పగించిన సంగతి కూడా ఆయన ఈ పుస్తకంలో రాయడంతో ఎంతోమందికి తెలియనుంది. జలగం వెంగళరావు తనకు కార్పొరేషన్ పదవి ఇవ్వడం.. 1978లో తాను రాజకీయాలకు దూరమవడం.. మళ్లీ 83 లో టీడీపీ అభ్యర్ధిగా చివరి నిమిషం లో నామినేషన్ వేసి గెలవడం వంటి స్వవిషయాలనూ ప్రస్తావించారు. ఆ తర్వాత ఉపేంద్ర సహకారంతో ఎన్టీఆర్ కు దగ్గరవడం... అప్పటి జ్ఞాపకాలను ఆయన రాశారు. ఎన్టీఆర్ తనను మంత్రిని చేసిననాటి రోజులను ఆయన ప్రత్యేకంగా రాశారు.
ఎన్టీఆర్ తో చేరువగా దూరంగా..
1984 లో ఎన్.టిఆర‌్ పై నాదెండ్ల తిరుగుబాటు చేసినప్పుడు తను పోషించిన పాత్ర.. ఆ తరువాత తన కోరికపై తనకు ఎన్టీఆర్ హోం మంత్రి పదవి ఇవ్వడం.. ఆ తర్వాత కుల రాజకీయాల కారణంగా జిల్లాకు చెందిన బోళ్ల బుల్లిరామయ్య, పివి కృష్ణారావు వంటి నేతల కుట్ర కారణంగా ఎన్టీఆర్ తనను అనుమానించడం .. ఫలితంగా ఎన్టీఆర్ తో విభేదాలు, దూరం పెరగడం వంటివన్నీ జోగయ్య పుస్తకం చదివితే తెలుస్తుంది. ఎన్టీఆర్ కు దూరమైన తరువాత నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయంలో జానారెడ్డి సహకరించారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ వాస్తవాలు తెలుసుకుని 1988 మహానాడు ఏర్పాట్లను బాద్యతను తనకు అప్పగించగా విజయవంతం చేయడాన్ని ఆయన వివరించారు. ఆ తరువాత టీడీపీకి దూరమవడానికి కారణాలూ వివరించారు.
వంగవీటి రంగాను ఎవరు చంపించారు?
వంగవీటి రంగా హత్యకు ముందు జరిగిన కొన్ని ఘటనలను జోగయ్య తన పుస్తకంలో రాయడం సంచలనమవుతోంది. రంగాను చంపేయాలని కొందరు ఎన్టీఆర్ వద్ద ప్రస్తావించగా ఆయన వద్దన్నారని... కానీ, ఉపేంద్ర, చంద్రబాబునాయుడులు రంగా హత్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతూ... తనకు దండు శివరామరాజు ఈ విషయం చెప్పారంటూ జోగయ్య బాంబు పేల్చారు. ఇది ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. శివరామరాజు మాటలను తాను నమ్మలేదని.. కానీ, ఆయన చెప్పిన నెలరోజుల్లోనే రంగా హత్య జరిగిందని రాశారు.