Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ సినిమాలు మాని జ‌నంలో తిరుగు

By:  Tupaki Desk   |   13 Nov 2015 6:59 AM GMT
ప‌వ‌న్ సినిమాలు మాని జ‌నంలో తిరుగు
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోమారు వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో స‌మావేశం అవ‌డం ..ఈ క్ర‌మంలో అమ‌రావ‌తి నిర్మాణం - ప్ర‌త్యేక హోదా..ఇత‌రాల‌పై చ‌ర్చించ‌డం ద్వారా ప‌వ‌న్ రాజ‌కీయాల‌కు దూరం అనే భావ‌న‌కు తెర‌దించాడు. అయితే...ఈ క్ర‌మంలో ప‌వ‌న్‌ పై విమ‌ర్శ‌లు షురూ అయ్యాయి. ప‌వ‌న్‌ పై మాజీ ఎంపీ చేగొండి హ‌రిరామ‌జోగయ్య ఇంతెత్తున ఫైర‌వ‌డ‌మే కాకుండా ఆయ‌న‌కు నీతిపాఠాలు కూడా చెప్పారు.

ఇంత‌కీ రామ‌జోగయ్య ఏమ‌న్నారంటే..త‌న‌కు తెలిసినంత వ‌ర‌కు ప‌వ‌న్ త‌న ఇద్ద‌రు సోద‌రుల్లాగా డ‌బ్బుకు ప్రాధాన్యం ఇచ్చేమ మ‌నిషి కాద‌ని చెప్పారు. అయితే జ‌నంలో ఉండాల‌నుకునే నాయకుడు పుస్త‌కాలు చ‌దువుకుంటూ ఉంటే స‌రిపోద‌న్నారు. అందుకే ప‌వ‌న్ ఏం చేయాలో జోగ‌య్య ఉచిత స‌ల‌హా ఇచ్చారు. రెండేళ్ల‌లో సినిమాలు పూర్తిచేసుకొని జ‌నంతో క‌లిసిపోవాల‌ని చెప్పారు. ఇందుకు పాద‌యాత్ర చేయ‌డం అత్యుత్త‌మ మార్గ‌మ‌ని వివ‌రించారు. ఈ ప్ర‌క్రియ ద్వారా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల గురించి పూర్తి అవ‌గాహ‌న వ‌స్తుంద‌న్నారు.

ఇంతేకాదు ప‌వ‌న్ నిజాయితీ ప‌రుడంటూ వ‌స్తున్న అభినంద‌న‌లు కూడా జోగ‌య్య తిప్పికొట్టారు. "ప‌వ‌న్ నిజాయితీప‌రుడంటూ ఎలా చెప్తారు? ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీచేయాలి. అధికార‌ప‌గ్గాలు చేప‌ట్టి ఒక్క‌రూపాయి కూడా తీసుకోకుండా ప‌రిపాలిస్తే... అప్పుడు నిజాయితీప‌రుడు అంటాం" అని ముక్తాయించారు.

కొస‌మెరుపుః త‌ను ప‌వ‌న్‌ ను క‌లిసేందుకు అనేక సార్లు అపాయింట్‌ మెంట్ కోరినా..ప‌వ‌న్ ఇవ్వ‌లేద‌ని జోగ‌య్య ఆక్రోశం వ్య‌క్తం చేశారు. ఇంత విశ్లేష‌ణ‌కు అదే కార‌ణ‌మా అని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.