Begin typing your search above and press return to search.
అరుదైన అవకాశం : రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చేత ప్రమాణం
By: Tupaki Desk | 24 July 2022 1:37 PM GMTతెలుగు జాతి కీర్తిని చాటే విధంగా దేశ అత్యున్నత న్యాయం స్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నారు. గత ఏడాది ఏప్రిల్ 24న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక ఆగస్ట్ నెలలో ఆయన పదవీ విరమణ చేస్తారు. ఆయన కచ్చితంగా పదహారు నెలల పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఇంత సుదీర్ఘ కాలం ఈ కీలకమైన పదవిలో ఉండడం కూడా గొప్ప విషయం.
ఈ రికార్డునకు తోడు మరో రికార్డుని ఆయన సొంతం చేసుకోబోతున్నారు. ఏడున్నర పదుల స్వాతంత్ర్య భారతాన పద్నాలుగు మంది రాష్ట్రపతులు ప్రమాణం చేశారు. రాజ్యాంగం ప్రకారం వారి చేత సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ లే ప్రమాణం చేయిస్తారు. ఆ విధంగా చూస్తే పద్నాలుగు సార్లు ఇతర రాష్ట్రాలకు చెందిన చీఫ్ జస్టిస్ లకే ఆ చాన్స్ దక్కింది.
కానీ పదిహేనవసారి మాత్రం ఒక తెలుగు బిడ్డకు ఆ అపురూపమైన అవకాశం లభించింది. ఈ కీలకమైన సమయాన చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ఉండడంతో ఆయన ఈ నెల 25న ద్రౌపది ముర్ము చేత రాష్ట్రపతిగా ప్రమాణం చేయించనున్నారు. ఈ అద్భుతమైన సన్నివేశం తెలుగు వారు సగర్వంగా చూడబోతున్నారు. నిజానికి 1966 ప్రాంతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తొలి తెలుగు వారు కోకా సుబ్బారావు నియమితులయ్యారు. ఆయన హయాంలో రాష్ట్రపతుల చేత ప్రమాణం చేయించే భాగ్యం లభించలేదు.
ఇన్నేళ్లకు మరో తెలుగువారు ఎన్వీ రమణ ఆ అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. ఈ ఏడాదే రాష్ట్రపతి ఎన్నికలు జరగడంతో ఎన్వీ రమణకు దేశ ప్రధమ పౌరురాలు చేత ప్రమాణం చేయించేందుకు వీలు కలిగింది. అంతే కాదు ఈ ఏడాది దేశ స్వాతంత్రానికి 75 ఏళ్ళు నిండుతాయి. ఈ శుభవేళ కూడా ఆయన ఈ హోదాలో ఉండడం గొప్ప గౌరవంగానే చూడాలి.