Begin typing your search above and press return to search.
వివాదంలో చెల్లుబోయిన ? సాష్టాంగ ప్రణామమా ఎందుకని !
By: Tupaki Desk | 2 May 2022 11:30 AM GMTమంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ఎక్కడకు వెళ్లినా కొంత సొంత కథ చెబుతారు. తరువాత కొంత వైసీపీ కథ చెబుతారు. కొంత అతి గానే మాట్లాడి వెళ్లిన దాఖలాలు ఉంటాయి. ఆవిధంగా ఆయన మొన్నటి వేళ కొంత కాదు కాస్త శ్రుతి మించిన తీరులోనే మాట్లాడి, సాష్టాంగపడి వివాదాలకు తావిచ్చారు. దీంతో ఇవన్నీ విని చూసిన సంబంధిత కుల కూటమి (శెట్టి బలిజ సంఘం పెద్దలు) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీల ఆత్మగౌరవం గురించి తెల్లారితే చాలు మాట్లాడే మంత్రి ఈ విధంగా తమ కులం పరువు పోయేలా ప్రవర్తించవచ్చా అని నిలదీస్తున్నారు. అందుకనే వారు ఈ స్వామి భక్తి ని చూసి తట్టుకోలేకపోతున్నారు.
ప్రేమాభిమానులు వ్యక్తుల విషయమై ప్రదర్శించే తీరు ఇది కాదని, పబ్లిక్ మీటింగులలో ప్రవర్తించే తీరు ఇది కానేకాదని వీళ్లంతా అంటే శెట్టి బలిజ కులస్థులు అంతా మంత్రికి హితవు చెబుతున్నారు. కొందరైతే ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు.
వైసీపీలో వెల్లువెత్తుతున్న స్వామి భక్తిని ఆపడం కష్టంగానే ఉంది. ఎప్పటికప్పుడు అదొక అనియంత్రిత వ్యవస్థలానే ఉంది. వ్యవస్థ కాదు అవస్థ.. అనియంత్రిత అవస్థ అని రాయాలి. దీంతో తరుచూ వివాదాలు వాకిట నిలుస్తున్నాయి. తరుచూ ఏదో ఒక వార్త లో మంత్రులు చిర్రెత్తుకొచ్చే విధంగా కనిపిస్తున్నారు.
అసలు వదిలి కొసరు మిన్న అనే విధంగా ప్రవర్తిస్తూ మీడియలో నిలుస్తున్నారు. ఈ హెడ్స్ లైన్స్ షో కాదు కాదు ఈ హెడేక్ షో ఇప్పట్లో ఆగదులేండి. గతంలో కూడా ఎన్నో వివాదాలు స్వామి భక్తి ని అతిగా ప్రదర్శించిన కారణంగానే పుట్టుకువచ్చాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో కాస్త అతిగా ప్రవర్తించిన మంత్రి చెల్లుబోయిన వేణు ( బీసీ సంక్షేమం మరియు సినిమాటోగ్రఫీ శాఖల నిర్వహణను చూస్తున్నారీయన) టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సాష్టాంగ ప్రణామం చేశారు. ఇటీవల కుడిపూడి చిట్టబ్బాయి (మాజీ ఎమ్మెల్యే, గోదావరి జిల్లాలలో కాస్త పేరున్న నేత) ప్రథమ వర్థంతిని అమలాపురంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
వైవీని, జగన్ నూ పొగడ్తలతో ముంచెత్తారు. వారిద్దరూ చిట్టబ్బాయి కుటుంబాన్ని ఆర్థికంగా ఎంతగానో ఆదుకున్నారని ప్రశసించి మాట్లాడుతూ మాట్లాడుతూ వైవీ కాళ్లకు మొక్కారు.ఇదే ఇప్పుడు శెట్టి బలిజ కులస్థులకు కోపం తెప్పిస్తోంది. ఎందుకంటే మంత్రిది కూడా వాళ్ల సామాజిక వర్గమే కనుక. వెంటనే ఆయన తమకు క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు సంబంధిత కుల సంఘం నాయకులు, పెద్దలు.