Begin typing your search above and press return to search.
కరోనా భయంతో మానవత్వం మంటకలుస్తోంది
By: Tupaki Desk | 30 March 2020 3:55 PM GMTకరోనా నివారణ చర్యల పేరుతో పోలీసులు మున్సిపల్ అధికారులు కొన్ని చోట్ల చేపడుతున్న కార్యక్రమాలు తీసుకుంటున్న కఠిన చర్యలు మరీ దారుణంగా ఉంటున్నాయి. రోడ్ల మీదకు వచ్చిన జనాలను పోలీసులు చితక బాదడం తెల్సిందే. జనాలకు భయం చెప్పాలనే ఉద్దేశ్యంతో కొడుతున్నామని కవర్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నా కూడా మరీ ప్రాణాలు పోయేంతగా కొట్టారు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ సమయంలోనే మున్సిపల్ అధికారులు చేపడుతున్న పారిశుద్ద కార్యక్రమాలపై కూడా విమర్శలు వస్తున్నాయి.
రోడ్లను వీధులను శానిటైజ్ చేసే ఉద్దేశ్యంతో కెమికల్స్ కలిపిన మిశ్రమాన్ని దేశ వ్యాప్తంగా ముఖ్య నగరాలు పట్టణాల్లో స్ప్రే చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా యూపీలో ఆ కెమికల్ మిశ్రమాన్ని జనాలపై చల్లడం విమర్శలకు తెరలేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వివిధ రాష్ట్రల్లో చిక్కుకున్న వారిని యూపీ ప్రభుత్వం తాజాగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి బరేలీ జిల్లాకు చేర్చడం జరిగింది. ఒక బస్సు వచ్చి రాగానే అందులోంచి జనాలందరిని కిందకు దించి ఒక్క చోట కూర్చోబెట్టి వాళ్లపై ఈ కెమికల్ మిశ్రమంను బురద బురదగా జల్లారు.
పిల్లలు పెద్దవాళ్లందరిపై ఆ మిశ్రమంను స్ప్రే చేయడం జరిగింది. ఆ సమయంలో మీ కళ్లు మూసుకోండి అలాగే మీ పిల్లల కళ్లు కూడా మూయండి అంటూ అధికారులు వారికి సూచించారు. కళ్లు మూసుకున్నా కూడా విపరీతంగా కళ్లు మండినట్లుగా వారు చెప్పారు. ఇలా జంతువులపై స్ప్రై చేస్తారని మరీ దారుణంగా ఇలా మనుషులపై కూడా చేస్తారని ఇప్పుడే చూశాం అంటూ కొందరు నెటిజన్స్ మండి పడుతున్నారు.
కరోనాతో ప్రాణ భయం కలిగి ఉండవచ్చు కాని మరీ ఇంత దారుణంగా మానవత్వం మరిచి మరీ ప్రవర్తించడం ఏంటీ అంటూ అధికారులను నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. వారిని మనుషులుగా ట్రీట్ చేసి ఉంటే బాగుండేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. అధికారులు మాత్రం తమ చర్యను సమర్థించుకున్నారు. కరోనా వ్యాప్తికి కొన్ని కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదని అందులో భాగమే ఇది అంటూ ఒక అధికారి వ్యాఖ్యలు చేశాడు.