Begin typing your search above and press return to search.

పుల్వామా దాడి: అమేజాన్ లో కెమికల్స్ కొన్నారు

By:  Tupaki Desk   |   9 March 2020 4:36 AM GMT
పుల్వామా దాడి: అమేజాన్ లో కెమికల్స్ కొన్నారు
X
దాదాపు 45 మందికి పైగా భారత సైనికులు మరణించిన పుల్వామా టెర్రరిస్టు దాడి దేశాన్ని కుదేపిసింది. పాకిస్తాన్ పై దాడులకు ఉసిగొల్పింది. తాజాగా ఈ పుల్వామా అటాక్స్ పై దర్యాప్తు జరిపిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఇందులో వాజ్ ఉల్ ఇస్లాం, మహ్మద్ అబ్బాస్ లను అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయం వెలుగుచూసింది.

పుల్వామా దాడి కోసం టెర్రరిస్టులు బాంబు, ఇతర మెటీరియల్ అంతా ఎలా తయారు చేసుకున్నారో విచారణలో వెలుగుచూసింది. ఐఈడీ బాంబు తయారీకి కావాల్సిన కెమికల్స్, బ్యాటరీ, ఇతర మెటీరియల్ అంతా ఆన్ లైన్ రిటేల్ షాపింగ్ అమేజాన్ సైట్ ద్వారా కొన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

జైషే అహ్మద్ సంస్థ ఇచ్చిన సూచనల మేరకు అమేజాన్ లో ఈ మెటీరియల్ ను వాజ్ ఉల్ అనే టెర్రరిస్టు కొన్నట్టు విచారణలో వెలుగుచూసింది. ఈ రా మెటీరియల్ తోనే జైషే సంస్థ ఐఈడీ బాంబు తయారు చేసినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో మహ్మద్ ఉమర్ కీలకంగా వ్యవహరించాడు. 2018 నుంచి ఇతడు జవాన్లపై దాడికి కశ్మీర్లో ప్లాన్ చేసినట్టు తెలిసింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన సమీర్, కమ్రాన్ లు ఉమర్ కు సహకరించారు.