Begin typing your search above and press return to search.
పిచ్చ ప్రకటన చేసిన బేకరి ఓనర్ అరెస్టు అయ్యాడు
By: Tupaki Desk | 11 May 2020 6:45 AM GMTపిచ్చ పీక్స్ కు చేరింది. ఏ మాత్రం శాస్త్రీయత లేని కొన్ని వాదనలు సోషల్ మీడియా పుణ్యమా అని ఇష్టారాజ్యంగా హల్ చల్ చేస్తున్నాయి. సముచిత కారణం లేకుండా ముస్లింల మీద లేనిపోని నిందలు వేయటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. కొందరి తప్పుల్ని అందరి తప్పులుగా ఎత్తి చూపటానికి మించిన దుర్మార్గం మరొకటి ఉండదు. మత పిశాచి మనసును మొత్తంగా ఆక్రమిస్తే ఎలాంటి దరిద్రాలుచోటు చేసుకుంటాయో తాజా ఉదంతం ఇట్టే చెప్పేస్తుంది.
చెన్నైకి చెందిన ఒక బేకరి యజమాని పిచ్చ ప్రకటన ఒకటి చేశాడు. తన బేకరీలో ముస్లిం ఉద్యోగులు లేరని.. తాము తయారు చేసే అన్ని ఉత్పత్తులు జైనులే తయారు చేస్తారంటూ ఒక ప్రకటనను సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లింది.
ముస్లిం మనోభావాలు దెబ్బ తీసేలా బేకరీ యజమాని ప్రచారం చేస్తున్నారన్నకంప్లైంట్ అతనిపై వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు సదరు బేకరీ యజమానిని అదుపులోకి తీసుకొని కసు నమోదు చేశారు. ఇలాంటి దరిద్రపుగొట్టు ప్రకటనలతో అమ్మకాలు పెంచుకోవాలన్న ఆలోచనే దుర్మార్గంగా చెప్పాలి. ఇలాంటి తీరును అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.