Begin typing your search above and press return to search.
కరోనా వేళ కన్నీటి కథ..బరియల్ కు వెళితే బాదేశారు
By: Tupaki Desk | 21 April 2020 5:30 PM GMTప్రపంచ దేశాలను గడగడలాడించేస్తున్న కరోనా మహమ్మారి... తన వల్ల చనిపోయిన వారి అంత్యక్రియలనూ హింసాత్మకంగా మార్చేస్తున్న వైనం కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న అనారోగ్యంతో మృతి చెందిన హైదరాబాదీ అంత్యక్రియను జఠిలం చేసిన కరోనా భయం.. ఇప్పుడు చెన్నైలో ఏకంగా అంత్యక్రియలకు వెళ్లిన ఓ డాక్టర్ - అతడికి సహాయంగా వచ్చిన వ్యక్తులపై ఏకంగా భీకర దాడి జరిగేలా చేసింది. ఈ ఘటనలో స్థానికుల చేతిలో రక్త గాయాలపాలైన వైద్యుడు... తన కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు వెళ్లలేదు. తనతో పాటే కలిసి వైద్యుడిగా పనిచేస్తున్న ఓ వక్తి చనిపోతే... స్నేహితుడి అంత్యక్రియలకు వెళ్లి స్థానికుల చేతిలో చావు దెబ్బలు తిన్నారు. స్నేహితుడి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లిన సదరు వైద్యుడిపై అక్కడి స్థానికులు నిజంగానే భీకర దాడి చేశారు. ఈ క్రమంలో రాళ్లు - కర్రల దెబ్బలు తింటూనే స్నేహితుడి అంత్యక్రియలను హడావిడిగా చేసేసి... ఆ వైద్యుడు పరుగెత్తుకుంటూ వెళ్లిపోవాల్సి వచ్చింది.
నిజంగానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రదీప్ కుమార్ వైద్యుడిగా పనిచేస్తున్నారు. ప్రదీప్ కుమార్ పనిచేస్తున్న చోటే... సైమన్ హెర్కులస్ కూడా వైద్యుడిగా పని చేస్తున్నారు. కరోనా పాజిటివ్ రోగులకు వైద్యం అందిస్తున్న క్రమంలో సైమన్ ఆ వైరస్ బారిన పడ్డారు. సైమన్ కూతురుకు కూడా వైరస్ సోకగా... తండ్రీకూతుళ్లిద్దరూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సైమన్ ప్రాణాలు విడిచారు. దీంతో శోకసంద్రంలో కూరుకుపోయిన ప్రదీప్... చనిపోయిన తన మిత్రుడికి అంత్యక్రియలు నిర్వహించాల్సిన బాధ్యత తీసుకున్నారు. సైమన్ భార్య, కొడుకులను వెంటేసుకుని, తాను పనిచేస్తున్న ఆసుపత్రికి చెందిన ఇద్దరు వార్డు బాయ్ ల సహకారంతో ఎలాగోలా సైమన్ మృతదేహాన్ని శ్మశాసానికి వెళ్లారు. కరోనా బారిన పడి చనిపోయిన వారి అంత్యక్రియలకు 20 అడుగుల లోతు గుంతను తీయాల్సి ఉన్న నేపథ్యంలో జేసీబీని కూడా ప్రదీప్ తీసుకెళ్లారు. ఇంకాసేపు ఉంటే... సైమన్ మృతదేహానికి ప్రదీప్ అంత్యక్రియలను పూర్తి చేసి వెనుదిరిగేవారే.
అయితే అనుకోని పిడుగులా శ్మశానానికి సమీపంలోని స్థానికులంతా కూడగట్టుకుని ప్రదీప్ బృందంపైకి దండెత్తి వచ్చారు. వచ్చీ రావడంతోనే ప్రదీప్ బృందంపై స్థానికులు రాళ్ల దాడి చేశారు. చేతికి అందిన కర్రలతో స్వైర విహారం చేశారు. ఊహించని ఈ దాడితో ప్రదీప్ అంతలోనే తేరుకుని... తన స్నేహితుడి భార్య, కుమారుడిని ఎలాగోలా తప్పించి అక్కడి నుంచి పంపించివేశారు. సైమన్ అంత్యక్రియలు పూర్తి కాకుండానే వారు అక్కడి నుంచి తరలివెళ్లాల్సి వచ్చింది. అయితే స్నేహితుడి మృతదేహాన్ని అలాగే అక్కడ వదిలేసి వెళ్లేందుకు ప్రదీప్ కు మనసు రాలేదు. ఓ వైపు రాళ్లు తనపై పడుతున్నా... వెనకడుగు వేయకుండా తమపై దాడి చేస్తున్న స్థానికులను వేడుకుంటూనే... ఎగిరిపడుతున్న రాళ్ల కారణంగా మేనిపై రక్త గాయాలు అవుతున్నా... పంటి బిగువున బాధను భరిస్తూ స్నేహితుడి మృతదేహానికి ఎలాగోలా అంత్యక్రియలు పూర్తి చేసి బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మొత్తం తతంగాన్ని మీడియాకు వివరించిన ప్రదీప్.. కరోనా పట్ల ప్రజల్లో ఎలాంటి భయాందోళనలు నెలకొన్నాయన్న విషయాన్ని వివరిస్తూ.. తాను ఎదుర్కొన్న మానసిక వేదనను కన్నీటి పర్యంతమయ్యారు.