Begin typing your search above and press return to search.
చెన్నైకి వెళ్తున్నారా... థింక్ చేయండి !
By: Tupaki Desk | 26 Jun 2017 4:26 PM GMTతమిళ తంబీలకు ఊహించని కష్టం వచ్చింది. ఆ రాష్ట్ర రాజధాని అయిన చెన్నై నగరాన్ని నీటి సంక్షోభం అతలాకుతలం చేస్తోంది. ఎన్నడూ లేని విధంగా చెన్నై నగరం నీళ్లు లేక అల్లాడిపోతున్నది. చెన్నై కి చుట్టు పక్కల ఉన్న 4 సరస్సులు... పూండి - రెడ్ హిల్స్ - చోలవరం - చెంబరంబక్కం చెరువులన్నీ ఎండిపోవడంతో గత 140 ఏళ్లుగా ఎప్పుడూ లేని నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. దీంతో అక్కడి పౌరులు తీవ్ర ఇబ్బందుల పాలు కావాల్సి వస్తోంది.
చెన్నై కి ప్రతి రోజు 830 మిలియన్ లీటర్ల నీళ్లు అవసరమవుతుందని ఒక అంచనా. అయితే ఇటీవలి కాలంలో దాదాపు అన్ని చెరువులు ఎండిపోవడం తో ప్రత్యామ్నాయ మార్గంలో నెయివెలి, తిరువల్లూరు నుంచి వాటర్ ను సప్లై చేస్తున్నారట. దాదాపు 200 కిమీల దూరంలో ఉన్న నెయివెలి - తిరువల్లూరు నుంచి భారీ పైపుల ద్వారా నీటి ని చెన్నై కి తరలిస్తున్నారట. ఆ నీళ్లు చెన్నై లోని సగం జనాభాకే సరిపోతాయట. దీంతో మిగితా సగం మంది గుక్కెడు నీళ్లు లేక నీరసించిపోతున్నారని మీడియా కథనాలు చెప్తున్నాయి. అయితే.. అక్కడ కూడా చెరువులు ఎండిపోయే దశకు చేరుకోవడంతో వేరే ప్రాంతం నుంచి 90 మిలియన్ లీటర్ల నీళ్లను తరలిస్తున్నారట. ఇక.. వర్షాలు తొందరగా పడి చెరువులు నిండితే కాని.. చెన్నై నగర దాహార్తి ని తీర్చలేమని అధికారులు చేతులెత్తేశారట.
చెన్నై నగరంలో ఉన్న కుంటలను తాగునీటి కోసం ఉపయోగించుకొని ఉంటే ఇప్పుడు ఈ నీటి సంక్షోభం ఏర్పడేదే కాదని పర్యావరణ అధికారులు ఆందోళన చెందుతున్నారు . అంతే కాకుండా.. నగరంలో పెరుగుతున్న జనాభా, నీటి వసతులను సరిగా ఉపయోగించుకోకపోవడం లాంటివి కూడా ఈ నీటి ఎద్దడికి కారణాలని వాళ్లు చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/