Begin typing your search above and press return to search.

చెన్నై వరదలతో పాములు.. జలగలు

By:  Tupaki Desk   |   2 Dec 2015 6:07 PM GMT
చెన్నై వరదలతో పాములు.. జలగలు
X
చెన్నై ప్రజలకు ఊహించని కష్టాలు మీద పడ్డాయి. ఇప్పటికే ఎడతెరపకుండా కురిసిన వర్షాలతో ఒకవిధమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి.. మంగళవారం కురిసిన భారీ వర్షంతో దాదాపు 70 లక్షల వరకు చెన్నై వాసులు తీవ్ర ఇక్కట్లలో చిక్కకుపోయినట్లు తెలుస్తోంది. భారీగా కురిసిన వానలతో చెన్నై వీధుల్లో 6 అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోవటం.. ఇళ్లల్లో ఉన్న ప్రజలు బయటకు రాని పరిస్థితి.

నిన్నవరకూ కనిపించిన రోడ్లు ఏ మాత్రం కనిపించకుండా.. కనుచూపు మేర మొత్తం నీటితో నిండిపోయిన చెన్నై మహా పట్టణంలో ఇప్పుడు మరో భారీ ప్రమాదం పొంచి ఉందన్న భావన వ్యక్తమవుతోంది. భారీగా వచ్చిపడ్డ వరద నీటిలో పాములు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వరద నీటితో కొట్టుకు వచ్చిన పాములు..జలగలు.. జెర్రెలు పలు అపార్ట్ మెంట్లు.. ఇళ్లల్లో రావటం చన్నై వాసుల్ని వణికిస్తోంది. వరద నీటిలో పాముల ఉన్నాయన్న వార్తలకు బలం చేకూరుస్తూ.. మామళ్లపురం ప్రాంతంలోని పెరుమాళ్ల దేవాలయంలోని విష్ణువు శిరస్సు భాగంలో కిరీటంలా ఉన్న నల్లతాచు పాము ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. దాదాపు 7 అడుగుల పొడవు ఉన్న ఈ కోబ్రో లాంటివి వాన నీటిలో ఎన్ని ఉన్నాయో అన్న వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు చెన్నై జూ పార్క్ నుంచి దాదాపు 30 మొసళ్లు కొట్టుకుపోయినట్లుగా వార్తలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే.. ఆ వార్తల్లో నిజం లేదని.. మొసళ్లు జూ లోనే ఉన్నాయని.. ఒక్క మొసలు కూడా బయటకు రాలేదని మద్రాస్ క్రోకడయిల్ ట్రస్ట్ స్పష్టం చేస్తోంది. చెన్నై జూలో 150 రకాల జంతువులతో పాటు మొసళ్లు ఉన్నాయి. అయితే.. వీటిని ఉంచిన బోన్ల నుంచి అవి బయటకు రాలేదని.. అనవసరంగా విస్తరిస్తున్న పుకార్లను నమ్మొద్దని క్రొకడయిల్ ట్రస్ట్ కోరుతోంది.