Begin typing your search above and press return to search.

చెన్నైలో మాన‌వ‌త్వానికి మ‌హోన్న‌త గుర్తింపు​

By:  Tupaki Desk   |   9 Dec 2015 5:58 AM GMT
చెన్నైలో మాన‌వ‌త్వానికి మ‌హోన్న‌త గుర్తింపు​
X
వర్ష బీభత్సంతో అతలాకుతలమైన చెన్నైలో మానవత్వం పరిమళించిన అనేక ఉదంతాలు ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి. ఈ వార్త అదే కోవలోకి వస్తుంది. మాన‌వ‌త్వం ప‌రిమ‌ళించిన ఓ మంచి మ‌నిషి స‌హాయం చేయ‌గా...తన గొప్ప మ‌న‌సును గుర్తించిన ఆ జంట కేవ‌లం థ్యాంక్స్‌ తో స‌రిపెట్ట‌కుండా..జీవితాంతం గుండెల్లో పెట్టుకునే గొప్ప నిర్ణ‌యాన్ని తీసుకుంది.

చెన్నైలో భారీ వర్షాల నేపథ్యంలో మహ్మద్‌ యూనుస్‌ అనే యువకుడు తన రెండు ప్లాట్లలో ఎవరైనా ఉండొచ్చునని ఆహ్వానించాడు. ఆ ఆహ్వానం న‌చ్చి అక్క‌డికి వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపిన వారిలో చిత్ర - మోహన్‌ అనే హిందూ దంపతులు కూడా ఉన్నారు. అయితే భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో వీళ్లు నివాసం ఉంటున్న ఉరప్పక్కం అనే ప్రాంతానికి వెళ్లి రక్షించేందుకు పడవల వాళ్లు ఆసక్తి చూపలేదు. దాంతో అతడు వారిని బతిమాలి పడవలను తీసుకుని వెళ్లి వారిని తన అపార్ట్‌మెంట్‌ కు తీసుకుని వచ్చి ఆశ్రయమిచ్చాడు. ఆ స‌మ‌యంలో చిత్ర నిండు గర్బిణి. అక్కడ కరెంటు కూడా లేదు. చాలామంది జనం చెట్లమీద వేలాడుతున్నారు. పడవలో ఆ గర్బిణిని కొందరిని పడవ ఎక్కించుకుని వచ్చాడు. దారిలో పడవ ఒక చెట్టును ఢీకొని బయటపడింది. తర్వాత చిత్రను ఆస్పత్రిలో చేర్చగా ఆమె ఆడబిడ్డను కన్నది. యూనస్ తోడ్పాటు వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని మోహన్ సంతోషపడుతున్నాడు. తన భార్య‌ - బిడ్డ ప్రాణాలు కాపాడిన యూనుస్‌ కు గుర్తుగా తమ బిడ్డకు యూన‌స్ అని పేరు పెట్టుకున్నారు.

ఈ స్పూర్తిదాయ‌క‌మైన సంఘ‌ట‌న ఇంత‌టితో అయిపోలేదు. తాను చేసిన సహాయానికి మోహన్ దంపతులు స్పందించిన తీరుకు అచ్చెరువొందిన యూనస్ ఆ బిడ్డ చదువులకయ్యే ఖర్చు భరిస్తానని మరింత మానవత్వం చాటుకున్నాడు. తాను చిత్రను హాస్పిటల్‌కు తీసుకువెళ్లే ఆ పదిహేను నిమిషాల ప్రయాణం తాను మర్చిపోలేనని యూనస్ చెప్పాడు.