Begin typing your search above and press return to search.
చెన్నై ఇప్పుడేమంటోంది..?
By: Tupaki Desk | 12 Dec 2015 7:42 AM GMTనెల రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో పోటెత్తిన వరదలతో చెన్నై మహానగరంతో పాటు.. తమిళనాడులోని వివిధ ప్రాంతాలు భారీగా నష్టపోవటం తెలిసిందే. ఏళ్లకు ఏళ్లు నిండని జలాశయాలు ఓవర్ ఫ్లో కావటం దగ్గర నుంచి.. ఎక్కడ చూసినా నీళ్లే.. నీళ్లు అన్నట్లుగా పరిస్థితి తయారు కావటం తెలిసేందే. వణికించిన వర్షాలు వెళ్లిపోయాయి. నీళ్లల్లో మునిగిపోయిన చెన్నై పట్టణం ఇప్పడిప్పుడే కోలుకొంటోంది. సంపన్నులు.. పేదవారు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారిని దెబ్బేసిన మాయదారి వర్షం తాలూకు చేదు గురుతుల నేపథ్యంలో చెన్నై మహానగరం ఇప్పుడెలా ఉంది? వారేం చేస్తున్నారు? చుట్టు పక్కల ప్రాంతాల వారి పరిస్థితి ఏమిటి? మొత్తంగా.. చెన్నై మహానగరం ఏమంటోందన్న విషయంలోకి వెళితే..
= భారీ వర్షాలు.. వరదల నుంచి చెన్నై మహానగరం ఇప్పుడిప్పుడే కోలుకొంటోంది. ఎవరికి వారు తమకు జరిగిన నష్టం ఎంతన్న లెక్కల్లోకి వెళుతున్నారు. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా వర్షం అందరిని ముంచేసింది.
= భారీ వర్షాల కారణంగా చెన్నై మహానగరంలోని 17 లక్షల మంది ఇంకా ఇంటిముఖం చూడలేదు. వారు ఇప్పటికి పునరావాస కేంద్రాల్లోనే తల దాచుకుంటున్నారు. వీరికి పునరావాసం కల్పించటం తమిళనాడు సర్కారుకు ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.
= తాజాగా వాతావరణ పరిస్థితి చూస్తే.. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడులోని కన్యాకుమారి.. తిరునల్వేలి.. తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తమిళనాడు ప్రజానీకం మరోసారి భయంతో వణికిపోతున్నారు.
= భారీ వర్షాల కారణంగా తమిళనాడులో మొత్తం 1.16లక్షల ఇళ్లు భారీగా ధ్వంసమయ్యాయి. మొత్తంగా 17.84లక్షల మంది పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు.
= చెన్నైలోని పరిశ్రమలు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక వర్గాలకు భారీ వర్షం కారణం తీవ్రనష్టం వాటిల్లేలా చేసింది. అసోచామ్ అంచనా ప్రకారం దాదాపు రూ.15వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
= వర్షాల కారణంగా మూసేసిన పలు పరిశ్రమలు నేటికీ తెరుచుకోనివి ఉన్నాయి. దీంతో.. అటు ఉద్యోగులు.. ఇటు పరిశ్రమలు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి.
= చెన్నైలో ఉన్న ఆటోమొబైల్ రంగానికి వర్షం కారణంగా రోజుకు రూ.180 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
= మాయదారి వర్షాల కారణంగా పలు కార్లు.. బైక్ కంపెనీల ఉత్పత్తుల మీద తీవ్ర ప్రభావం చూపింది.
= చెన్నై మహానగరానికి ఆయువుపట్టు లాంటి పారిశ్రామికవాడ అంబత్తూరు. ఇది పూర్తిగా మునిగిపోయి.. ఇప్పటికీ అక్కడ మామూలు పరిస్థితి నెలకొనలేదు.
= దాదాపు 600 పరిశ్రమలతో.. రెండు లక్షల మందికి ప్రత్యక్ష.. పరోక్ష ఉపాధి కల్పించే అంబత్తూరులో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభం కాని సంస్థలెన్నో.
= చెన్నైలోని 3.75 లక్షలమందికి ఉపాధి కల్పించే ఐటీ పరిశ్రమకు జరిగిన నష్టం అంతాఇంతా కాదు. ఐటీ రంగానికి జరిగిన నష్టం ప్రాధమికంగానే వేలాది కోట్లు ఉంటుందని అంచనా.
= వరదనీరు క్రమంగా తగ్గటంతో పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు ప్రజల్ని పంపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. మళ్లీ వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏమిటంటూ నిలదీస్తున్న ప్రజలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వ యంత్రాంగం కిందామీదా పడుతోంది.
= చెన్నై తాగునీటి అవసరాలు తీర్చే జలాశయాల్లో అతి పెద్దది చెంబరంపాక్కం జలాశయం. వర్షాలు భారీగా కురిసి జలాశయంలో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరితే మిగులు జలాల్ని వదులుతుంటారు. ఇటీవల కురిసిన వర్షాల పుణ్యమా అని స్లూయిజ్ ద్వారా వదిలే మిగులు జలాలు కుండ్రత్తూరు.. శ్రీ పెరుంబుదూరు రాష్ట్ర రహదారి మీద ప్రవహించి.. కాల్వలోకి వెళుతుంటాయి. నెల రోజుల పాటు విడవకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ రహదారి మీద భారీగా నిలిచిన వర్షపు నీటి కారణంగా 15 గ్రామాలకు మిగిలిన ప్రపంచంతో సంబంధం లేకుండా మారిపోయింది. ఇప్పటికీ భారీగా వరదనీరు వస్తుండటంతో.. ఈ రోజుకీ రవాణా సంబంధాలు పునరుద్దరించలేదు. దీంతో.. మరో దారి నుంచి వెళ్లాల్సి వస్తోంది. ఇది ఆ 15 గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.