Begin typing your search above and press return to search.

కరోనా వైరస్: ఫుట్‌ పాత్‌ పై శవాన్ని పట్టించుకోని దయనీయ పరిస్థితి

By:  Tupaki Desk   |   1 Feb 2020 3:30 AM GMT
కరోనా వైరస్: ఫుట్‌ పాత్‌ పై శవాన్ని పట్టించుకోని దయనీయ పరిస్థితి
X
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపు 213 మందిని బలి తీసుకుంది. వేలాది మంది దీని బారిన పడ్డారు. అమెరికా - సింగపూర్ - భారత్ సహా అన్ని దేశాలు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. వుహాన్ నుంచి ఇండియన్ విమానం భారతీయులను వెనక్కి తీసుకు వస్తోంది. ఈ ప్రాణాంతక కరోనా వైరస్ డ్రాగన్ కంట్రీ ప్రజలను దయనీయస్థితికి నెట్టి వేసింది.

ఎప్పుడూ రద్దీగా ఉండే వుహాన్ వీధులు ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో వెలవెలబోతున్నాయి. ఈ నగరాన్ని దాదాపు మూసివేశారు. ఎంతో అవసరమైతే తప్ప ప్రజలు మాస్కులు ధరించి గానీ బయటకు రావడం లేదు. వీధులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

అలా అత్యవసరమై బయటకు వచ్చిన ప్రజలకు రోడ్డు పక్కన ఓ మృతదేహం కనిపించింది. దాని దగ్గరకు వెళ్లేందుకు ప్రజలు ధైర్యం చేయలేకపోయారు. గంటల కొద్దీ ఆ మృతదేహం అక్కడే ఉన్నా.. చనిపోయింది ఎవరు అని తెలుసుకునేందుకు కూడా వెళ్లే సాహసం చేయలేకపోయారు అంటే పరిస్థితి ఎంత దయనీయాంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

గంటలు గడిచిన గానీ పోలీసులు - వైద్య సిబ్బంది వచ్చి ఆ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆ మృతదేహం ఫుట్‌పాత్‌పై పడిపోయి కనిపించింది. ఫేస్ మాస్క్ ధరించి - ఓ చేతిలో ప్లాస్టిక్ బ్యాంక్‌ తో తెల్ల జుట్టుతో పడి ఉన్నాడు. జర్నలిస్టులు ఈ ఫోటోను తీయడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు, మెడికల్ సిబ్బంది మాస్కులు - ప్రొటక్షన్ సూట్ ధరించి అతని మృతదేహాన్ని బ్లాంకెట్‌లో చుట్టి తీసుకెళ్లారు.

కరోనా భయంతో మృతదేహం వద్దకు ఎవరూ వెళ్లలేకపోయారు. అతను కూడా ఇదే వైరస్‌తో చనిపోయాడని భయపడి - అతని వద్దకు వెళ్తే తమకూ సోకుతుందని వెళ్లలేదు. తమ ప్రాంతంలో ఇంత భయంకరమైన పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే అతడు ఎలా చనిపోయిందో పరీక్షల అనంతరం తెలుస్తుంది.