Begin typing your search above and press return to search.
చెన్నైలో వణికిస్తున్న కటింగ్ మాస్టర్
By: Tupaki Desk | 29 April 2020 5:15 AM GMTసెలూన్ ఓపెన్ చేసి.. తన వద్దకు వచ్చిన కస్టమర్ కు కటింగ్ చేయటం నేరమా? అంత దానికే ప్రాణాలు పోతాయా? అన్న ప్రశ్నలకు అవునన్న సమాధానం కరోనా వేళకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన వేళలో.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొందరి కారణంగా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి తలెత్తుతోంది. తాజాగా చెన్నైలో అలాంటి పరిస్థితే నెలకొంది.
వలసరవక్కం ప్రాంతానికిచెందిన ఒక వ్యక్తి కోయంబేడలో సెలూన్ షాపు నిర్వహిస్తుంటాడు. విడి రోజుల్లో అతగాడ్నిపట్టించుకునే నాథుడే ఉండదు. కానీ.. కరోనా టైంలో ఇతగాడు రేపిన కలకలం అంతా ఇంతాకాదు. నిబంధనలకు విరుద్ధంగా సెలూన్ తెరిచిన 36 ఏళ్ల వ్యక్తికి ఈ నెల 23న జ్వరం వచ్చింది. దీంతో.. అతన్ని హుటాహుటిన క్వారంటైన్ సెంటర్ కు తరలించారు.
ఇష్యూ ఇక్కడితో ఆగిపోలేదు. అతడికి కరోనా టెస్టు చేస్తే పాజిటివ్ గా తేలింది. దీంతో అతడు కాంటాక్టు అయిన వారి జాబితాను సేకరించే పనిలో అధికారులు బిజీ అయ్యారు. ఆరా తీస్తున్న కొద్దీ.. అతడు కాంటాక్టు అయిన వారి సంఖ్య పెద్దదిగా మారుతోంది. ఇప్పటివరకూ32 మందిని పోలీసులు గుర్తించి.. వారిని క్వారంటైన్ సెంటర్ కు తరలించి.. పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే సెలూన్ కు వచ్చిన వారికి మాత్రమే కాదు.. దాదాపు పది నుంచి పదిహేను మంది ఇళ్లకు వెళ్లి మరీ కటింగ్ చేసినట్లుగా గుర్తించారు. దీంతో..ఆయా కుటుంబాల వారికి కొత్త ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తోంది. ఇప్పుడు వారందరిని గుర్తించి.. క్వారంటైన్ కు పంపే ఏర్పాట్లలో అధికారులు మునిగి తేలుతున్నారు.