Begin typing your search above and press return to search.

సీటు కోసం యూనివ‌ర్సిటీ సైట్ నే హ్యాక్ చేశాడు!

By:  Tupaki Desk   |   1 Sep 2017 6:10 PM GMT
సీటు కోసం యూనివ‌ర్సిటీ సైట్ నే హ్యాక్ చేశాడు!
X
కంటెంట్ ఉన్నోడికి కాంపిటీటివ్ టెస్ట్ ఎందుకు బాస్‌? డైలాగ్ కాస్త ఢిప‌రెంట్‌ గా ఉందే అనుకుంటున్నారా...అవును డిఫ‌రెంట్ స్టోరీకి డిఫ‌రెంట్ హెడింగ్ అయితేనే క‌నెక్ట‌వుతుంది. ఇదంతా టెక్నాల‌జీ యుగం క‌దా. ఇంకా..ఎక్క‌డో ఉంటే ఎలా? ఒక‌ప్పుడంటే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ గ‌ట్రా.. జ‌న‌రేష‌న్లు మారినా.. ఇంకా ఆ తొక్క‌లో ఎంట్రెన్స్ లు అవ‌స‌ర‌మా.. మ‌న టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటే చాలు క‌దా.. సీట్ వ‌స్తుంది అని అనుకున్నట్టున్నాడు చెన్నైకి చెందిన ఓ యువ‌కుడు.

యూనివర్సిటీ ఆఫ్ మ‌ద్రాస్ కు చెందిన సైబ‌ర్ ఫోరెన్సిక్ సెంట‌ర్.. సైబ‌ర్ సెక్యూరిటీ లో ఎమ్మెస్సీ డిగ్రీ ని అందిస్తోంది. ప్ర‌స్తుతం ఎంతో డిమాండ్ లో ఉన్న కోర్సు ఇది. మొత్తం 25 సీట్లు ఉంటాయి. ఈ కోర్సు చేసిన వ్య‌క్తుల‌కు టాప్ బ్యాంక్స్ - ఫైనాన్సియ‌ల్ ఇనిస్టిట్యూష‌న్స్ - ఐటీ కంపెనీలు - ఇంట‌లీజెన్స్ బ్యూరో - పోలీస్ డిపార్ట్ మెంట్లలో జాబ్స్ కోకొల్ల‌లుగా ఉన్నాయి. అందుకే ఇందులో కొత్త‌గా సీటు కోసం ట్రై చేశాడు.

మ‌ద్రాస్ యూనివ‌ర్సిటీ వెబ్ సైట్ నే ఏకంగా హ్యాక్ చేసి తానెంటో నిరూపించుకున్నాడు. ఇంత‌కీ హ్యాక్ చేశాక ఏం చేశాడ‌య్యా అంటే... ``ఇదంతా ఉత్తినే చేశా. నాకు ఉన్న స్కిల్స్ మీకు చూపించాలి క‌దా. అందుకే సైట్ ను హ్యాక్ చేశా. ఇక‌.. నాకు యూనివ‌ర్సిటీలో సైబ‌ర్ కోర్స్ సీటు ఇయ్యండి`` అని యూనివ‌ర్సిటీ అధికారుల‌కే ఝ‌ల‌క్ ఇచ్చాడ‌ట‌. దెబ్బ‌కు షాక్ దిన్న యూనివ‌ర్సిటీ అధికారులు.. అవ‌న్నీ కుద‌ర‌దు..ఏది ఏమైనా ఎంట్రేన్స్ రాయాల్సిందే అన్నార‌ట‌. దీంతో త‌ప్ప‌క ఎగ్జామ్ రాశాడ‌ట‌. ఇక్క‌డే అస‌లు ట్విస్ట్‌. ఆ ప‌రీక్ష‌లో పాస్ కాలేద‌ట మ‌నోడు. దీంతో మ‌నోడికి సీటు మాత్రం దొర‌క‌లేదు. గ‌త జూన్ లో యూనివ‌ర్సిటీకి ఓ ఈమెయిల్ చేశాడ‌ట ఈ కుర్రోడు. ఏమిటంటే.. ``యూనివ‌ర్సిటీ వెబ్ సైట్ కు న‌ష్టం చేసేందుకు నేను హ్యాక్ చేయ‌లేదు. కాని.. యూనివ‌ర్సిటీ వెబ్ సైట్ చాలా వీక్ గా ఉంది. సెక్యూరిటీ అస్స‌లు లేద‌ని చెప్ప‌డానికే అలా చేశా. దాంతో పాటు త‌న‌కు ఇన్ఫోసెక్ (ఇన్ఫ‌ర్మేష‌న్ సెక్యూరిటీ) ఫీల్డ్ లో ప‌నిచేయ‌డమంటే ఇష్ట‌మ‌ని.. అందుకే ఓ సీటు త‌న‌కు ఇవ్వాలి`` అని అని ఆ మెయిల్ లో కోరాడ‌ట మ‌నోడు.