Begin typing your search above and press return to search.
50 రోజులు ఇంట్లోనే..బయటకు రాగానే సోకిన వైరస్
By: Tupaki Desk | 22 May 2020 10:30 AM GMTమహమ్మారి వైరస్ ప్రబలడంతో దాని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధించారు. ఈ లాక్‌డౌన్‌పై చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కానీ కొంతమంది మాత్రం నిబద్ధతతో, కఠినంగా పాటించిన వారు కూడా ఉన్నారు. అలా ఓ లాక్‌డౌన్ ఉన్నన్నాళ్లు ఇంటికే పరిమితమయ్యాడు. ఇప్పుడు నిబంధనలు సడలింపులు ఇవ్వడంతో బయటకు వచ్చాడు. బయటకు అలా వచ్చాడో లేదో ఆ మహమ్మారి వైరస్ సోకింది. 50 రోజుల పాటు ఇంట్లోనే స్వీయ నిర్బంధం ఉన్నా నిష్ప్రయోజనమైంది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది.
ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న వ్యక్తి లాక్‌డౌన్‌తో 50 రోజులు ఇంట్లోనే ఉన్నాడు. తాజాగా సడలింపులు ఇవ్వడంతో అన్నీ సంస్థల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అతడి కంపెనీ కూడా ప్రారంభం కావడంతో ఉద్యోగానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో కంపెనీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని విధులకు హాజరుకావాలని సమాచారం ఇచ్చింది. దీంతో అతడు పరీక్షలు చేయించుకున్నాడు. అయితే ఆ పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్ ఉందని తేలింది. దీంతో అతడు షాక్‌కు గురయ్యాడు. ఇన్నాళ్లు ఇంట్లో ఉన్నా కూడా ఆ వైరస్ ఎలా సోకిందని బాధితుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతడికి పాజిటివ్ తేలడంతో అతడు నివసించే ప్రాంతంలో కార్పొరేషన్ అధికారులు రాకపోకలు నిషేధించారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు. 50 రోజులుగా ఇంట్లో ఉన్న వ్యక్తికి కరోనా ఎలా వచ్చిందని అధికారులు ఆరా తీయగా.. కరోనా పరీక్షలకు వెళ్లే ముందు ఆ వ్యక్తి మనలిలోని ఓ ఏటీఎంకు వెళ్లొచ్చినట్లు తెలిసింది. ఆ విధంగా అతడికి వైరస్ సోకిందని తేలింది.