Begin typing your search above and press return to search.
హమ్మయ్య..మబ్బులు తొలిగి సూరీడు కనిపించాడు
By: Tupaki Desk | 7 Dec 2015 4:18 AM GMTసూరీడు కనిపించటం కూడా వార్తేనా? అన్న డౌట్ వస్తుంది కానీ.. చెన్నై ప్రజలకు ఇది నిజంగా చాలా పే..ద్ద వార్త. దాదాపుగా 20 రోజులుగా ఆకాశానికి దట్టంగా మబ్చేసిన మేఘాల కారణంగా సూరీడు జాడ లేకుండా పోయిన పరిస్థితి. ఆకాశానికి చిల్లులు పడినట్లుగా కుండపోత వానతో.. చెన్నై మహానగరం అతలాకుతలమైంది. దాదాపుగా 20రోజులకు పైనే.. సూరీడి దర్శనం లేదు.
అలాంటిది సోమవారం ఉదయం.. మేఘాల్ని చీల్చుకొని వచ్చిన సూర్య కిరణాలు చూసిన చెన్నై ప్రజల ఆనందానికి హద్దుల్లేవు. వరుస వానలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వారికి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ ఎండ అత్యవసరం. బురదతో నిండిపోయిన చెన్నై మహానగరం సేద తీరాలన్నా.. వస్తువుల్ని ఆర బెట్టుకోవాలన్నా.. సహాయక చర్యలు మరింత ముమ్మరం కావాలన్న సూరీడు ఉండాల్సిందే.
దాదాపు మూడు వారాలకు పైనే సూరీడు జాడ లేకుండా పోయి.. సోమవారం సూరీడు కనిపించేసరికి చెన్నై ప్రజలు ఆనంద పడతున్నారు. వాన జాడ లేకుండా మండే ఎండలే ఇప్పుడు చెన్నై మహానగరికి అత్యవసరం. మరి.. సూరీడి కరుణ ఎంతసేపు ఉంటుందో..?