Begin typing your search above and press return to search.
సముద్రం బాటపట్టిన చెన్నై వాసులు
By: Tupaki Desk | 10 July 2019 4:48 AM GMTతలాపునే సంద్రం.. తడవడానికి మాత్రం నీరు లేదు. ఇది తమిళనాడు రాజధాని చెన్నై నీటి గోస. చెన్నై నగర పక్కనే సముద్రపు తీరం ఉంది. అంతపెద్ద నీటి సంద్రం ఉన్నా చెన్నై మాత్రం గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతోంది. సముద్రపు నీరు ఉప్పు నీరు. అది తాగడానికి - సాగుకు పనికి రాదు. ఇక వర్షాభావం.. వానలు పడక చెన్నైలో భూగర్భ జలాలు ఎండిపోయాయి. చెరువులు - డ్యాములు వట్టిపోయాయి. దీంతో బిందెడు నీటి కోసం యుద్ధాలు - హత్యలు - కొట్లాటలు చెన్నైలో సర్వసాధరణంగా మారాయి.
ఇప్పుడు చెన్నై వాసుల నీటి కష్టాలను సముద్రపు నీటితో వారే తీర్చుకుంటున్నారు. తాజాగా చెన్నైలోని చాలా హోటళ్లలో ప్లాస్టిక్ - స్టీలు ప్లేట్లను తీసివేయించారు. వాటిని తిరిగి కడగడానికి కూడా నీరు లేకపోవడంతో అరిటాకులు - పేపర్ ప్లేట్లను వాడుతున్నారు. వాటిలో తినేసి చెత్తడబ్బాల్లో వేస్తున్నారు. ఇక తాగడానికి మినరల్ వాటర్ కొనుక్కోవాలి. మరి కడుక్కోవడానికి ఎలా ? అందుకే ఇప్పుడు వ్యాపారులంతా సముద్రం బాట పట్టారు.
సముద్రంలోకి వెళ్లి ఉప్పు నీటిని ట్యాంకర్ల ద్వారా తెచ్చుకొని దాన్ని కడుక్కోవడానికి నిత్యావసరాలకు వాడుతున్నారు. ఇప్పుడు చెన్నై హోటళ్లలో - ఇళ్లల్లో కడుక్కోవడానికి అంతా సముద్రపు నీరే దిక్కైందట..
ఇలా ప్రకృతి ప్రకోపానికి చెన్నై నీటి కష్టాలు పడుతోంది. జూన్ లో పడాల్సిన వానలు జాడలేకపోవడం.. చెరువులు - ప్రాజెక్టులు నిండకపోవడం.. భూగర్భ జలాలు అడుగంటడంతో చెన్నై వాసుల నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చివరకు అక్కరకు రాని సముద్రపు నీటితో కడుక్కోవాల్సిన దుస్థితి వారికి దాపురించింది.