Begin typing your search above and press return to search.

రీల్ మాదిరి రియ‌ల్ గా రౌడీల్ని ప‌ట్టేశారు

By:  Tupaki Desk   |   8 Feb 2018 4:53 AM GMT
రీల్ మాదిరి రియ‌ల్ గా రౌడీల్ని ప‌ట్టేశారు
X
సినిమాల్లో క‌నిపించే సీన్ ఒక‌టి రియ‌ల్ గా చెన్నై మ‌హాన‌గ‌రంలో చోటు చేసుకుంది. రౌడీల్లో ఫేమ‌స్ రౌడీ ఒక‌రు బ‌ర్త్ డే పార్టీ ఏర్పాటు చేయ‌టం.. దానికి సాటి రౌడీలంతా పెద్ద ఎత్తున హాజ‌రు కావ‌టం.. ఇలాంటి అవ‌కాశం కోస‌మే ఎదురుచూసే హీరో పోలీస్‌.. వారి ఆట క‌ట్టించ‌టం లాంటి సీన్లు చాలానే సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. నిజంగానే ఇదే రీతిలో చోటు చేసుకోవ‌టం తాజాగా సంచ‌ల‌నంగా మారింది.

చెన్నై మ‌హాన‌గ‌ర శివారులో ఏర్పాటు చేసిన ఒక రౌడీ బ‌ర్త్ డే పార్టీకి హాజ‌రైన రౌడీల్ని పెద్ద ఎత్తున పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘ‌ట‌న తాజాగా చోటు చేసుకుంది. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున తుపాకీలు.. మార‌ణాయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. 69 మంది పేరుమోసిన రౌడీల్ని ఒకే స్పాట్ లో ప‌ట్టేసుకున్నారు. సంచ‌ల‌నంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

చెన్నైలోని చూళైమేడులో బిను పేరుమోసిన రౌడీ. అత‌డి మాట‌కు ఎదురుండ‌దు. ప‌లు నేరాల్లో అత‌డికి భాగ‌స్వామ్యం ఉంది. బినును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు తెగ ట్రై చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. అత‌డ్ని ప‌ట్టుకునేందుకు ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇలాంటి వేళ‌.. అత‌డి బ‌ర్త్ డే పార్టీని గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకుంటున్న స‌మాచారం పోలీసుల‌కు అందింది.

చెన్నై శివారులోని మాంగాడు స‌మీపంలోని మ‌లైయంబాక్కంలోని ఒక లారీ షెడ్డులో భారీ ఎత్తున పార్టీ నిర్వ‌హిస్తున్న స‌మాచారాన్ని గుట్టుగా సేక‌రించారు పోలీసులు. రౌడీల‌ను ప‌ట్టుకునేందుకు మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. అయితే.. త‌మ పార్టీ ముచ్చ‌ట పోలీసుల‌కు తెలీద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న రౌడీలు మ‌రోప‌క్క భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ పార్టీకి పెద్ద ఎత్తున రౌడీలు హాజ‌ర‌య్యారు. ఇంత భారీగా ఒకేసారి ఇంత మంది రౌడీలు రావ‌టంతో పోలీసులు మ‌రింత అలెర్ట్ అయ్యారు.

ఒక్కో రౌడీని ప‌ట్టుకోవ‌టానికి త‌ల ప్రాణం తోక‌కు వ‌చ్చే ప‌రిస్థితుల్లో.. టోకుగా ప‌దుల లెక్క‌న రౌడీలు ప‌ట్టుకునే అవ‌కాశం చిక్క‌టంతో పోలీసులు ప‌క్కాగా కార్న‌ర్ చేసేశారు.

అంబ‌త్తూరు డిప్యూటీ పోలీస్ క‌మిష‌న‌ర్ నేతృత్వంలో అసిస్టెంట్ క‌మిష‌న‌ర్లు ఇద్ద‌రు.. ప‌ది మంది ఇన్ స్పెక్ట‌ర్లు.. 15 మంది ఎస్ ఐలతో పాటు 50 మంది పోలీసులు అధికారులు పార్టీ జ‌రిగే ప్రాంతానికి వెళ్లి మొత్తంగా క‌వ‌ర్ చేసేశారు. స‌రిగ్గా పార్టీ మాంచి ర‌స‌కందాయంలో ఉండ‌గా పోలీసులు ఎంట‌ర్ అయ్యారు. క‌రుడుగ‌ట్టిన నేరస్తులంతా ఒక చోట‌కు చేర‌టం.. అక్క‌డ‌కు వ‌చ్చిన వారిలో మోస్ట్ వాంటెడ్ నేర‌స్తులు ఉండ‌టంతో మ‌రింత అలెర్ట్ అయ్యారు.

స‌రిగ్గా పార్టీ మ‌ధ్య‌లో దాడి చేశారు. ఈ సంద‌ర్భంగా 60 టూవీల‌ర్స్‌.. 10 ఆటోలు.. 7 కార్లు.. ప‌లు వేట‌కొడ‌వ‌ళ్లు.. 35 క‌త్తులు.. ఖ‌రీదైన సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. రౌడీల బ‌ర్త్ డే పార్టీ విష‌యాన్ని సామాన్య ప్ర‌జ‌లే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌టం. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు సినిమాటిక్ గా స‌రైన సంద‌ర్భంలో ఎంట్రీ ఇచ్చిన ఖాకీలు క‌రుడుగ‌ట్టిన రౌడీల‌కు దిమ్మ తిరిగే షాకిచ్చారు. ప్ర‌స్తుతం ఈ రౌడీ బ్యాచ్ అంతా జైల్లో ఉంది. వీరు గ‌తంలో చేసిన నేరాల గురించి చిట్టాను సిద్ధం చేస్తున్నారు. మ‌రి.. వీరికి కోర్టులు ఎలాంటి శిక్ష‌లు విధిస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.