Begin typing your search above and press return to search.
చెన్నై పోలీస్ బాస్ చేసిన పని తెలిస్తే ఫిదా కావాల్సిందే!
By: Tupaki Desk | 14 Jun 2020 8:21 AM GMTవిధి నిర్వహణలో సమర్థత ప్రదర్శించటం చాలామంది చేసేదే. జట్టు నాయకుడిగా వ్యవహరిస్తే.. తన జట్టులోని వారి కోసం తల్లడిల్లటం.. వారి కోసం ఎంతకైనా సరే.. అన్నట్లుగా చేయటం చాలా తక్కువమంది బాస్ లు చేస్తుంటారు. తాజాగా చెన్నై పోలీస్ కమిషనర్ చేసిన పని తెలిస్తే.. ఆయన పెద్ద మనసుకు ఫిదా కావాల్సిందే. తమిళనాడు పోలీస్ శాఖలో హాట్ టాపిక్ గా మారిన చెన్నై మహానగర సూపర్ కాప్ ఏకే విశ్వనాథన్ ఏం చేశారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
మాయదారి మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో తీవ్రత ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. చెన్నై మహానగరంలో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. వైరస్ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వ్యవహరిస్తున్న పోలీసులు పలువురు దీని బారిన పడుతున్నారు. ఇలాంటి వారికి మెరుగైన వైద్య సాయాన్ని అందిస్తున్నా.. కొందరి విషయంలో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
ఇటీవల కాలంలో చెన్నైలో ఐదు వందలకు పైగా పోలీసులకు పాజిటివ్ గా తేలింది. దీంతో.. పోలీసు యంత్రాంగంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వారిలో స్థైర్యం నింపుతూ వైద్యం చేస్తున్నారు. వారికి అందుతున్న వైద్య సహాయంపై చెన్నై మహానగర పోలీస్ కమిషనర్ నిత్యం వైద్యులతో సంప్రదింపులు జరుపుతూ.. వారికి అన్ని సౌకర్యాలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే.. వారికి అవసరమైన అన్ని సాయాలు అందేలా చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల్లోనూ స్థైర్యాన్ని నింపుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఒక పోలీసుకు పాజిటివ్ గా తేలింది. అతడి ఆరోగ్యం విషమించింది. అతడిని రక్షించేందుకు హైదరాబాద్ నుంచి ఒక వ్యాక్సిన్ ను తెప్పించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఇంజెక్షన్ ఒక్కొక్కటి రూ.75వేలు. సదరు పోలీసుకు మూడు ఇంజెక్షన్లు అవసరం. కానీ.. అంత ఖర్చును తట్టుకునే స్తోమత సదరు పోలీసుకు లేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న విశ్వనాథన్.. తన సొంత ఖర్చుతో హైదరాబాద్ నుంచి ఆ ఇంజెక్షన్ ను తెప్పించారు.
పాజిటివ్ గా నమోదైన వారి ఆరోగ్య పరిస్థితి విషమిస్తే.. చివరి ప్రయత్నంగా ఈ ఇంజెక్షన్ ను ఇస్తారని చెబుతారు. కొన్ని సందర్భాల్లో పని చేస్తుందని.. మరి కొన్ని సందర్భాల్లో సానుకూల ఫలితం రాదు. అదే జరిగితే.. ఇన్ని లక్షలు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఎక్కడి దాకానో ఎందుకు.. ఈ మధ్యన మాయదారి రోగంతో మరణించిన డీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్ ను సేవ్ చేసేందుకు సైతం హైదరాబాద్ నుంచి ఈ ఇంజెక్షన్ ను తెప్పించి వాడారు. అయినా.. ఫలితం లేకుండా పోయింది.
ఫలితంతో సంబంధం లేకుండా తన కింద పని చేసే ఒక పోలీసును కాపాడేందుకు తన సొంత డబ్బులతో ఇంజెక్షన్లు తెప్పించి.. చికిత్స చేయించారు. లక్కీగా ఆ పోలీసు కోలుకున్నారు. త్వరలోనే అతగాడు డిశ్చార్జి అవుతారని చెబుతున్నారు. సరైన సమయంలో సాయం చేసేందుకు ఖర్చు వెనకాడకుండా సొంత డబ్బులతో ఇంజెక్షన్లు తెప్పించిన సీపీ పెద్ద మనసును పలువురు పొగిడేస్తున్నారు. విషయం తెలిసిన వారంతా ఆయనకు ఫిదా అవుతున్నారు.