Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నం: ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక ర‌ద్దు

By:  Tupaki Desk   |   10 April 2017 4:39 AM GMT
సంచ‌ల‌నం: ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక ర‌ద్దు
X
అంచ‌నాలే నిజ‌మ‌య్యాయి. ఆరాచ‌కానికి పరాకాష్ఠ‌గా మారిన ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ను ర‌ద్దు చేస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణంది.యాన్ని తీసుకుంది. అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో ఖాళీ అయినా ఆర్కేన‌గ‌ర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక‌ను నిర్వ‌హించారు. అమ్మ వార‌స‌త్వ ప‌గ్గాలు ఎవ‌రికి చెందుతాయ‌న్న తీర్పుతో పాటు.. త‌మిళ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేసే ఈ ఎన్నిక ఫ‌లితంపై దేశ వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. ఈ ఎన్నిక ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న అంశంపై భారీ చ‌ర్చే న‌డుస్తోంది. ఇలాంటి వేళ‌.. ఈ ఎన్నిక‌ల్లో ఏ విధంగానైనా గెలుపే ప‌ర‌మావ‌ధిగా ప‌లు పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. అంద‌రి కంటే నాలుగు ఆకులు ఎక్కువ చ‌దివింది అన్నాడీఎం శ‌శిక‌ల వ‌ర్గం.

అధికార పార్టీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త సంక్షోభం నేప‌థ్యంలో.. ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యాన్ని త‌మ ఖాతాలో వేసుకునేందుకు చిన్న‌మ్మ వ‌ర్గం చేస్తున్న‌ప్ర‌య‌త్నాలు అన్నిఇన్ని కావు. ఈ ఎన్నిక కోసం చిన్న‌మ్మ వ‌ర్గం ఇప్ప‌టివ‌ర‌కూ రూ.89 కోట్లు ఖ‌ర్చు పెట్టింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన పోలింగ్ నాటికి ఇది మ‌రింత భారీగా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకునేందుకు ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేసింద‌న్న‌మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఉప ఎన్నిక‌లో విజ‌యం కోసం అన్ని అడ్డ‌దారులు తొక్కేసింద‌న్న చిన్న‌మ్మ‌వ‌ర్గం మీద వెల్లువెత్తుతున్న ఆరోప‌ణ‌ల‌పై ఐటీ దాడులు నిర్వ‌హించ‌గా.. భారీ ఎత్తున ఎన్నిక‌ల అక్ర‌మాలు చోటు చేసుకున్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. రాష్ట్ర ఆరోగ్య‌శాఖామంత్రి విజ‌య‌భాస్క‌ర్‌.. సినీ హీరో శ‌ర‌త్ కుమార్.. మ‌రికొంద‌రిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా భారీ అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వైనాన్ని గుర్తించారు. మొత్తం 32 ప్రాంతాల్లో నిర్వ‌హించిన సోదాల్లో దాదాపు రూ.90 కోట్ల మేర ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంపిణీ చేసిన‌ట్లుగా గుర్తించారు. ఇంత భారీ ఎత్తున చోటు చేసుకున్న అక్ర‌మాల నేప‌థ్యంలో.. ఉప ఎన్నిక‌ను నిర్వ‌హించ‌టం స‌రి కాద‌న్న మాట స‌ర్వ‌త్రా వినిపించింది.

అధికార‌ప‌క్షం ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ ఈ ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఇప్ప‌టికేప‌లు ఫిర్యాదులు అంద‌టం.. ఐటీ అధికారుల నుంచి సాక్ష్యాలు అందిన నేప‌థ్యంలో.. ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ను ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. తాజాగా వెల్లువెత్తుతున్న ఆరోప‌ణ‌లు.. సాక్ష్యాల‌పై ఆదివారం ప్ర‌త్యేకంగా భేటీ అయిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉప ఎన్నిక‌ను ర‌ద్దు చేస్తున్న నిర్ణ‌యాన్ని ఆదివారం రాత్రి 10.30 గంట‌ల త‌ర్వాత ప్ర‌క‌టించారు. విచ్చ‌ల‌విడిగా సాగుతున్న ధ‌న ప్ర‌వాహంపై ఐటీ శాఖ ఇచ్చిన నివేదిక‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఆస్తుల్ని గుర్తించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇందులో భాగంగానే ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ను ర‌ద్దు చేస్తూ ఈసీ నిర్ణ‌యం తీసుకుంది. ఇదే రీతిలో గ‌తంలో తంజానూరు.. అర‌వ‌కురిచి ఉప ఎన్నిక‌ల్లోనూ విప‌రీత‌మైన ధ‌న ప్ర‌వాహం పొర్లింద‌నే ఆరోఫ‌ణ‌ల నేప‌థ్యంలో అప్ప‌ట్లోనూ ఉప ఎన్నిక‌ను ర‌ద్దు చేశారు. తాజాగా దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన నోట్ల క‌ట్ట‌ల ఉదంతం నేప‌థ్యంలో.. ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ను ఈసీ ర‌ద్దు చేసిన తీరు త‌మిళ రాజ‌కీయ పార్టీల‌కు షాకింగ్ మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/