Begin typing your search above and press return to search.

సైబర్ అటాక్స్.. అందరికీ ఇదో హెచ్చరికే..

By:  Tupaki Desk   |   13 Sep 2019 7:31 AM GMT
సైబర్ అటాక్స్.. అందరికీ ఇదో హెచ్చరికే..
X
టెక్నాలజీ.. ఎంత వాడుకుంటే అంత సమాజహితానికి ఉపయోగపడుతుంది. ఇదే టెక్నాలజీని దుర్వినియోగానికి వాడుకోవచ్చని చాలా సినిమాల్లో చూశాం. అయితే ఇప్పుడు దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలు చూశాక ఏ ఎలక్ట్రానిక్ పరికరం హ్యాంకింగ్ కు గురయ్యిందో తెలియని పరిస్థితి నెలకొంది.

మనకు తెలియకుండానే బ్యాంకుల్లోని మన ఖాతాల్లో డబ్బులు మాయం కావడం.. మన ఫోన్లు - కంప్యూటర్ల నుంచి పాస్ వర్డ్ లు - కీలక సమాచారం తస్కరించడం చూస్తున్నాం. ఇదంతా సైబర్ దొంగల పని.. తాజాగా షాకింగ్ సర్వే ఒకటి బయటపడింది. దేశంలోని ప్రతి ముగ్గురిలో ఒక ఇంటెర్నెట్ వినియోగదారుడిపై సైబర్ దాడి జరిగినట్లు ఓ సర్వే తేల్చింది.

కే7 కంప్యూటింగ్ లిమిటెడ్ సంస్థ తాజాగా చేసిన ‘సైబర్ నేరాల నిఘా’ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. దేశంలోనే అత్యధికంగా సైబర్ దాడులు చెన్నైలో జరిగాయి. ఇక్కడ దాడాపు 48శాతం సైబర్ దాడులు జరిగినట్లు తెలిపారు. అత్యల్పంగా ఢిల్లీలో 28శాతం సైబర్ దాడులు జరిగాయి. ఆ తర్వాత వరుసగా పాట్నా - హైదరాబాద్ - బెంగళూరులు - గౌహతిల్లో 40శాతానికి పైగా సైబర్ దాడులు జరిగాయి.

దాదాపు 72శాతం మ్యాక్ కంప్యూటర్లు (ఆపిల్ సంస్థ తయారీవి)పై సైబర్ దాడులు జరిగినట్టు సర్వే సంస్థ తెలిపింది. ఇక యాడ్ వేర్, వాటెడ్ ప్రోగ్రామ్స్ - అప్లికేషన్లపై ఎక్కువ దాడులు జరిగాయి. మన వాడే ఫోన్లు - స్మార్ టీవీలు - కెమెరాలు - ప్రింటర్ - రూటర్లపై కూడా సైబర్ దాడి జరిగినట్టు సర్వే సంస్థ తేల్చింది. సో మన దగ్గరున్న ఎలక్ట్రానిక్ పరికరం ఏదైనా దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరిపై దాడి అంటే ఖచ్చితంగా మన ఫోన్లు, కంప్యూటర్లు కూడా సైబర్ దాడికి గురయ్యే ఉంటాయి. వినియోగదారులు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.