Begin typing your search above and press return to search.
కేసీయార్ హీరో...మరి జగన్...చెప్పాల్సింది వైసీపీ ఎమ్మెల్యేనే...?
By: Tupaki Desk | 25 Aug 2022 2:38 PM GMTపొరుగు రాష్ట్రం సీఎం కేసీయార్ హీరో అనేశారు వైసీపీ ఎమ్మెల్యే. ఆయన కంటికి కేసీయార్ అద్భుతమైన వీరోచితమైన రాజకీయ నాయకుడిగా కనిపించారు. ఇందులో తప్పులేదు. కానీ ఆయన ఆంధ్రాకు చెందిన ఎమ్మెల్యే. పైగా వైసీపీ ఎమ్మెల్యే. మరి వైసీపీలో హీరో అంటే ఎవరికైనా ఠక్కున జగనే గుర్తుకు రావాలి. జగన్ కంటే హీరోలు ఎవరూ లేరక్కడ. కానీ ఆయన మాత్రం ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా హీరో అంటే కేసీయారే సుమా అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
అవును ఆయనకు గట్స్ ఉన్నాయి. పైగా రాయలసీమ వాసి. ఉమ్మడి కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ కి చెందిన వారు. ఆయన వైసీపీకి చెందిన చెన్నకేశవరెడ్డి. ఆయన తరచుగా సంచలన కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఆయన తనకు నచ్చినట్లుగా మాట్లాడుతారు. నిజానికి వైసీపీలో చాలా మందికి చాలా రకాలైన అభిప్రాయాలు ఉంటాయి కానీ బయటకు పెదవి విప్పరు. కానీ ఈయన బహు చిత్రమైన వారు. అందుకే ఆయన బీజేపీ మీద మండిపోతున్నారు.
తన మంటను దాచుకోకుండా బయటకు అనేస్తున్నారు. బీజేపీని ఎదిరించే బహు మొనగాడు కేసీయార్ ఒక్కరే సుమా అని కూడా మాట్లాడుతున్నారు. కేంద్రంలోని ఎండీయే సర్కార్ మీద మోడీ మీద గట్టిగా మాట్లాడే దమ్మూ ధైర్యం కేసీయార్ కే ఉన్నాయని ఆయన కితాబు ఇచ్చారు. బీజేపీ దేశంలో దారుణమైన పాలన చేస్తోందని, ఆ పార్టీని దించాలని కూడా చెన్నకేశవరెడ్డి పిలుపు ఇవ్వడం విశేషం.
ఇక పోతే బీజేపీ దేశంలోని రాష్ట్రాల అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని, రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకోవడం లేదని చెన్నకేశవ రెడ్డి మండిపడ్డారు. ఇక అధికారం కోసం బీజేపీ చేస్తున్న రాజకీయం దారుణంగా ఉందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఒక్కో ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ఇరవై కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని సంచలన కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యానికి ఈ రకమైన ధోరణి సిగ్గుచేటు అని కూడా చెన్నకేశవరెడ్డి ఘాటైన విమర్శలు చేశారు.
నిజానికి మోడీ సర్కార్ విషయంలో వైసీపీ చాలా జాగ్రత్తగా ఉంటోంది. అంతే కాదు మోడీకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. కేంద్రంతో పరోక్ష దోస్తీ చేస్తూ వస్తోంది. మరి అలాంటి వైసీపీలో ఒక ఎమ్మెల్యే గుంటూరు మిర్చీ లాంటి హాట్ హాట్ కామెంట్స్ మోడీ మీదనే చేస్తే బీజేపీ వారు ఊరుకుంటారా. పైగా ఇది వైసీపీకి కూడా ఇరకాటమే. ఇక చెన్నకేశవరెడ్డి గతంలో కూడా బీజేపీ మీద ఈ తరహా కామెంట్స్ చేశారు.
ప్రశాంత దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారాఅశాంతిని తీసుకురావడానికి ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు బిజెపి ప్రయత్నిస్తున్నాయని చెన్నకేశవరెడ్డి అప్పట్లో ఆరోపించారు. ఇపుడు ఆయన చేసిన కామెంట్స్ పట్ల మళ్లీ బీజేపీ నేతలు మండుతున్నారు. అదే సమయంలో వైసీపీలో కూడా దాని మీద చర్చ సాగుతోంది.
జగన్ నాయకత్వాన వైసీపీలో ఉంటూ కేసీయార్ ని హీరోగా చెప్పడం అంటే ఒక విధంగా సొంత పార్టీలో కూడా మంట పెట్టినట్లే అంటున్నారు. పైగా మోడీని ఎదిరించే ఏకైక మొనగాడు కేసీయార్ అయితే మోడీతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్న జగన్ ఏమవుతారు. అంటే ఇండైరెక్ట్ గా చెన్నకేశవరెడ్డి సొంత పార్టీ మీద కామెంట్స్ చేశారు అనుకోవాలి. చూడాలి మరి చెన్నకేశవరెడ్డి హాట్ కామెంట్స్ ని వైసీపీ ఎలా తీసుకుంటుందో.