Begin typing your search above and press return to search.

కరణం టీడీపీ ఎమ్మెల్యేవు..గుర్తుందా? చీరాలను టీడీపీ మయం చేయాలనే ఆలోచనా?

By:  Tupaki Desk   |   3 Sep 2020 11:50 AM GMT
కరణం టీడీపీ ఎమ్మెల్యేవు..గుర్తుందా? చీరాలను టీడీపీ మయం చేయాలనే ఆలోచనా?
X
ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ తరుఫున పోటీచేసిన కరణం బలరాం వైసీపీ గాలిని తట్టుకొని గెలిచాడు. అక్కడ 2014 ఎన్నికల్లో స్వతంత్రయ అభ్యర్థిగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ రాష్ట్ర స్థాయిలో సంచలనం రేపి గుర్తింపు పొందాడు.

ఎవరికీ తెలియని ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా గెలిచిన తరువాత రాష్ట్రంలో అంతా తెలిసిపోయాడు. అయితే 2019 ఎన్నికలు వచ్చేసరికి ఆమంచి వైసీపీలోకి జంప్ అయ్యి టీడీపీ మీద చంద్రబాబు మీద దుమ్మెత్తిపోసి పోటీచేశాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ నెలకొంది.

అప్పటికే చీరాల ఇన్ చార్జిగా ఉన్న యాదం బాలాజికి మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో పోటీచేసి ఓడిపోయిన యాదం బాలాజీకి సానుభూతి వచ్చింది. సీటు ఇవ్వలేదని ఆయనపై ప్రజల్లో అభిమానం పెరిగింది. బాగా కసిగా ఉన్న యాదం బాలాజీ చంద్రబాబు మాటలకు అట్రాక్ట్ అయ్యి నీకు ఎమ్మెల్యే సీటు భవిష్యత్ లో ఇస్తానని చెప్పి కరణం బలరాంకు సపోర్టు చేయి అని.. నీకు న్యాయం చేస్తా అని సూచించాడు.

యాదం బాలాజీ టీడీపీకి జంప్ అయితే అతడి వెంట ఉన్న బూత్ స్థాయిలోని వైసీపీ క్యాడర్ 50శాతం మంది టీడీపీ మీద ఇష్టం లేకున్నా ఆ పార్టీలో చేరిపోయి ఆమంచి కృష్ణమోహన్ ను ఓడగొట్టారనే ప్రచారం ఉంది.

అయితే ఇంకొక విషయం ఏంటంటే.. ఒకప్పుడు కరణం బలరాం జిల్లాలో హీరోగా ఉన్న గొట్టిపాటి రవి కుమార్ చేతిలో మూడు సార్లు ఓడిపోయిన తరువాత జీరో అయ్యాడు. అద్దంకి సీటు ఇవ్వకుండా చీరాల ఇచ్చాడు. యాదం బాలాజీ వలన గెలిచిన కరణం బలరాం... ఆ తర్వాత బలమైన ఆమంచి కృష్ణమోహన్ కు తట్టుకోలేక వైసీపీలోకి జంప్ అయ్యాడు.

ఇలాంటప్పుడు ఆమంచి కృష్ణమోహన్ కు కరణం బలరాంకు ఢీ అంటే ఢీ అనే పరిస్థితి వచ్చింది. అయితే వైఎస్ఆర్ వర్థంతి రోజున కరణం బలరాం కొడుకు ఆమంచిని ఉద్దేశించి వార్నింగ్ ఇవ్వడం సంచలనమైంది. దీనికి చీరాల అంతా ఉడుకుతోంది. ఇప్పుడు ఏమవుతుందో అనేది ఉత్కంఠగా మారింది.

కరణం బలరాం టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో పోటీచేసినా.. ఆమంచి కృష్ణమోహన్ కు వార్నింగ్ ఇవ్వడం లేదు. అయినా అతడు నాన్ లోకల్ క్యాండిడేట్. అలాంటి వాడు మాకు వార్నింగ్ ఇవ్వడం ఏందని.. వైసీపీ కార్యకర్తలు అందరూ కరణం బలరాం మీద గుర్రుగా ఉన్నారు.

కరణం బలరాం గ్యారెంటీగా వైసీపీలో ఉంటాడంటే అది కూడా కాదు.. ఇప్పుడు ప్రభుత్వంను వద్దనుకొని లాస్ట్ కు మళ్లీ టీడీపీకి జంప్ అవుతాడు అని చీరాలను ఇన్ డైరెక్టుగా టీడీపీ పసుపుమయం చేస్తున్నాడని వైసీపీ కార్యకర్తలు వాపోతున్నారు.

ఇది పార్టీకి నష్టం జరిగే పని కానీ.. ఎలాంటి లాభం జరగదు అని పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. చూద్దాం చివరకు ఎలా జరుగుతోందో..