Begin typing your search above and press return to search.
కేసీఆర్ పై 80 కిలోల జానారెడ్డి పోరాటం చేయట్లేదు!
By: Tupaki Desk | 23 March 2017 6:42 AM GMTసహజంగా సంయమనంతో మాట్లాడే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు - సీఎల్పీ నేత జానారెడ్డి ప్రాస కోసం వాడిన ఒకే ఒక్క పదం ఆయన్ను తీవ్ర ఇరకాటంలో పడేస్తోంది. 2019లో బాహుబలి వచ్చి కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాడని జానా వ్యాఖ్యానించడంపై ఇన్నాళ్లు కాంగ్రెస్ నేతలు వివిధ రకాల కామెంట్లు చేయగా తాజాగా తటస్థులు సైతం జానాపై విమర్శలు చేస్తున్నారు. గత ఎన్నికల వరకు టీఆర్ ఎస్ లో ఉండి అనంతరం బయటకు వచ్చిన చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమ వేదిక పేరుతో సొంత కార్యాచరణతో ముందుకు పోతున్నారు. వేదిక చైర్మన్ హోదాలో చెరుకు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు.
ప్రధాన ప్రతిపక్ష రథసారథిగా ఉన్న జానారెడ్డి తన పాత్రను పోషించడం లేదని చెరుకు సుధాకర్ అన్నారు. 80 కేజీల జానారెడ్డి - కేసీఆర్ పై పోరాటం ఎలా చేస్తారని ఎద్దేవా చేశారు. ఉద్యమకారులను తెలంగాణ ద్రోహులు అవమానిస్తున్నా కాంగ్రెస్ స్పందించడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుడే 2019లో బాహుబలిగా వస్తాడని చెరుకు సుధాకర్ వెల్లడించారు. రాజకీయపార్టీ ఏర్పాటుపై తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టమైన వైఖరి చెప్పడంలేదని విమర్శించారు. జేఏసీ నేతలు తెలంగాణ ఉద్యమ వేదికతో కలిసిరావాలని సుధాకర్ కోరారు. ప్రశ్నించడం కంటే పాలాబిషేకాలకే కేసీఆర్ ఆదరణ చూపుతున్నారని మండిపడ్డారు. తమిళనాడులో కంటే మించి ఎమ్మెల్యేలు - కులసంఘాలు - ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
ఇదిలాఉండగా...సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో సంచలన వ్యాఖ్య చేశారు. సీఎల్పీ నేత జానారెడ్డిని సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటిస్తే మద్దతునిస్తానన్నారు. ‘‘ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో మాట్లాడి ఆ ముక్కేదో చెప్పించుకోమన్నాను. లాబీయింగ్ చేసుకోమని జానాకు సూచించాను’’అని కూడా పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/