Begin typing your search above and press return to search.
డిప్యూటీ సీఎం కొడుకు ఎ14 ఎలా అవుతాడు
By: Tupaki Desk | 22 May 2017 6:23 AM GMT కర్నూలు జిల్లాలో వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్య కేసులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యాంబాబుపైనే ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... ఆయన్ను ఈ కేసు నుంచి ఎలాగైనా తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఆయనపై కేసు నమోదు చేసినా కూడా ప్రధాన నిందితుడిగా కాకుండా అక్యూజ్డ్ 14గా కేసు పెట్టారని విమర్శిస్తున్నారు.
శ్యామ్ బాబు సహా 13 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే.. అతన్ని ఎ-14గా చేరుస్తూ కేసు నమోదు చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసు నుంచి శ్యామ్ బాబును తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. పత్తికొండ వైసీపీ ఇన్‌చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి, అనుచరుడు సాంబశివుడు హత్య కేసులో 15 మందిపై కేసులు నమోదు అయ్యాయి. చెరుకులపాడు గ్రామానికి చెందిన గొల్ల కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు కృష్ణగిరి పీఎస్‌లో కేసులు నమోదు అయ్యాయి. చెరుకుల పాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు, రామానాయుడు, కోసనాపల్లికి చెందిన రామకృష్ణ, తొగర్చేడుకు చెందిన రామాంజనేయులు, బాలు, చిన్న ఎల్లప్ప, పెద్ద ఎల్లప్ప, వెంకటరాముడు, శ్రీను, చెరుకులపాడుకే చెందిన నారాయణ, రామాంజనేయులు, పెద్ద బీసన్న, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుపై కేసులు నమోదు చేశారు.
తన ఇసుక దందాకు అడ్డుపడ్డారన్న కోపంతోనే నారాయణరెడ్డిని కేఈ శ్యాంబాబు చంపిస్తే.. ఆ కేసులో ఏకంగా ఏ14గా చూపిస్తే ఆయనపై కేసును బలహీన పరిచేందుకే పోలీసులు ఇలా చేసినట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.