Begin typing your search above and press return to search.

‘‘చెస్’’ను కూడా ఖురాన్ బ్యాన్ చేసిందట

By:  Tupaki Desk   |   22 Jan 2016 10:28 AM GMT
‘‘చెస్’’ను కూడా ఖురాన్ బ్యాన్ చేసిందట
X
ప్రతి విషయంలోనూ పరిమితులు విధించుకుంటూ వెళుతూ పోవటం ఈ మధ్యన పెరుగుతోంది. కొన్ని మతాల విషయంలో ఈ తీరు మరింత పెరుగుతుంది.

ప్రతి విషయాన్ని ఆయా మతాన్ని ఆచరించే వారి కంటే పాలకులు.. మత గురువులు తమకు తోచిందే ధర్మంగా చెప్పటం ఎప్పటి నుంచో అలవాటైంది. మిగిలిన మతాలతో పోలిస్తే ఇస్లాంలో ఎక్కువైంది. ఎందుకిలా? అని ప్రశ్నించే గొంతులు బలహీనంగా ఉండటం.. ఒకవేళ ప్రశ్నించే గొంతుల్ని నొక్కేయటం అనాదిగా వస్తోంది. దీంతో.. కొందరి మాటలే ఇస్లాం ధర్మంగా మారిపోయిన దుస్థితి.

తమకు నచ్చని ప్రతి ఒక్క విషయాన్ని ఇస్లాం అంగీకరించదని.. ఖురాన్ ఒప్పుకోదని చెప్పటం అలవాటే. ఇంతకాలం కొందరు అతివాద ముస్లిం మత గురువులు.. తాలిబన్ తరహా ఉగ్రవాదులు పరిమితులు విధిస్తూ ఉండేవారు. తాజాగా ఆ జాబితాలోకి సౌదీ చీఫ్ కూడా చేరిపోయారు. తాజాగా ఆయన చదరంగం ఆట మీద చేసిన వ్యాఖ్యలు కొత్త కలకలాన్ని రేపారు. చెస్ ఆట గ్యాంబ్లింగ్ వంటిదని.. దాన్ని నిషేధించినట్లు వెల్లడించిన ఆయన చెస్ ఆడటం వృధా అని.. ముస్లింలు చెస్ ఆడటానికి దూరంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తమకు నచ్చని అంశాలు మత గ్రంధాలు పేర్కొన్నట్లుగా చెప్పే తీరుకు తగ్గట్లే సౌదీ చీఫ్ చెస్ విషయంలోనూ ఇదే భాష్యాన్ని చెప్పుకొచ్చారు. చెస్ ఆడొద్దని ఖురాన్ చెప్పినట్లుగా ప్రకటించారు. చెస్ ను 1970ల మొదట్లో ఇరాన్ సీనియర్ మత గురువులు బ్యాన్ చేశారు. అయితే.. తర్వాత అధికారంలోకి వచ్చిన ఖోమిని పదవిలోకి వచ్చాక నిషేధాన్ని తొలగించారు. తాజాగా సౌదీ చీఫ్ మరోసారి నిషేధం విధించారు.