Begin typing your search above and press return to search.
చేతన్ భగత్ కు సోషల్ మీడియా షాకిచ్చింది
By: Tupaki Desk | 31 Oct 2015 9:51 AM GMTప్రముఖ రచయత చేతన్ భగత్ సోషల్ మీడియా సెటైర్లకు దారుణంగా దొరికిపోయాడు. నెటిజన్లు ఆయన్ను ఏకిపారేశారు. దేశంలో పెచ్చుమీరుతున్న అసహనానిక నిరసనగా జాతీయ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న మేథావులు - కళాకారులకు తాజాగా చరిత్రకారులు కూడా తమ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చేతన్ భగత్ ట్విట్టర్ లో కాస్త తన మేధావితనం చూపించారు. ఆయన ట్వీట్ చాలామందికి కోపం తెప్పించడంతో వారంతా సోషల్ మీడియా వేదికగా చేతన్ భగత్ చెవులు పిండేశారు. రకరకాల వ్యాఖ్యాలతో ఆయన పరువు తీసేశారు. అసలు చేతన్ భగత్ ట్వీట్ చూస్తే కోపం రావాల్సిందే.... ‘‘చరిత్రకారులంటే ఏం చేస్తారు. నాకు ఆసక్తిగా ఉంది తెలుసుకోవాలని . ఇలా జరిగింది .. అలా జరిగింది.. అని రాయడం అంతేగా .. అంతటితో పనైపోతుంది’’ అని ట్వీట్ చేశారు. ఎవరి గురించైనా మరీ అంత తేలిగ్గా తీసిపడేసేలా మాట్లాడడం కరెక్టు కాదు. కాబట్టే నెటిజన్లు ఆయన్ను ఆడుకున్నారు.
తమలో ఉన్న టాలెంట్ అంతా చూపించి పేరడీలతో చేతన్ ఇక చాలు మొర్రో అనేలా సెటైర్లు వేశారు. అందులో కొన్ని చదివితే చేతన్ ను ఎంతగా టార్గెట్ చేసి దుమ్ము దులిపారో అర్థమైపోతుంది.
- ‘‘రచయతలంటే ఏం చేస్తారు నాకు తెలుసుకోవలని ఉంది . ఆఫ్ గర్ల్ ఫ్రెండు, పావు గర్ల్ ఫ్రెండు లాంటి లవ్ స్టోరీలు రాయడం .. అంతే పనైపోతెంది’’
- ‘‘ఐఐఎం గ్రాడ్యుయేట్స్ ఏం చేస్తారు థర్డ్ క్లాసు లవ్ స్టోరీలు రాయడం .. నాచ్ బలియే జడ్జిగా వెళ్లడం ... అంతే ...’’
- ‘‘ఎవరీ చేతన్ భగత్ ...నేనేం చదవలేదు..’’
..అందుకు మరొకరు రిప్లై ఇస్తూ...
- ‘‘అయ్యో చేతన్ భగత్ తెలీదా , ఎంత అపచారం’’
..దానికి కొనసాగింపుగా..
- ‘‘అవునా..నా తెలివితక్కువతనం తో నోబెల్ గ్రహీతకు అన్యాయం చేశానా , ఆయన ఇంకా మ్యాన్ బుకర్ ప్రైజ్ కోసం వేచిచూస్తున్నారు . ...2019 లోపల ఆయనకు పద్మశ్రీ కూడా వస్తుంది . అభినందనలు పోస్టులతో సిద్దంగా ఉండండి’’
- ‘‘ఇప్పుడు మా వూరికి ఫోన్ చేసి పిడకలు సిద్దం చేయమంటాను . చేతన్ మీ ఇంటీ అడ్రస్ చెప్తే మీ పుస్తకాలన్నీ తిరిగి ఇచ్చేస్తా..’’
- ‘‘ఓ ఇదా మీ అడ్రస్ ..( పక్కనే చెత్తబుట్ట బొమ్మ )
ఒకటా రెండా వందలకొద్దీ కామెంట్లతో చేతన్ భగత్ ఎందుకు ఈ వ్యవహారంలో వేలు పెట్టానా అని తల పట్టుకునేలా వాయించిపడేశారు. దెబ్బకు రచయితగారికి అర్థమై ఉంటుంది.. సోషల్ మీడియాతో పెట్టుకుంటే చావగొట్టి చెవులు మూస్తారని.