Begin typing your search above and press return to search.
ఏప్రిల్ ఫూల్..రాహుల్ ను మించిన ఆప్షన్ లేనట్లుంది
By: Tupaki Desk | 2 April 2018 1:52 PM GMTప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1 ని ఫూల్స్ డేగా జరుపుకుంటారని తెలిసిందే కదా. ఏప్రిల్ 1న జనాలను పిచ్చోళ్లను చేయడం ఓ పరిపాటిగా మారింది. ఎవరి పరిధిలో వారు తమదైన చతురతతో ఎదుటివారిని ఫూల్ చేస్తుంటారు. ఏప్రిల్ 1న ఇలా ఫూల్ చేసేందుకు ప్రముఖ రచయిత చేతన్ భగత్ చేసిన ట్వీట్ కు సోషల్ మీడియా వెర్రెత్తిపోయింది. పెద్ద ఎత్తున స్పందిస్తుంది. ఇటు కాంగ్రెస్ ను అటు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇరికిస్తూ చేతన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.
చేతన్ ట్వీట్లో ఏముందంటే....`"ఇక నేను ఆగలేను. ఈ దేశానికి ఏదైనా చేయాలి. అందుకే కాంగ్రెస్‌లో జాయిన్ అవుతున్నాను. కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేసి కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తాను. రాహుల్ గాంధీతో కలిసి బెటర్ ఇండియాను తయారు చేద్దాం. దీనికోసం నాకు మీ ఆశిస్సులు కావాలి. మిగితా వివరాలకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి.." అంటూ చేతన్ ట్వీట్ చేశాడు. ప్రముఖ రచయిత కాబట్టి దానిపై క్రేజ్ పెరిగింది. దీంతో ఆ లింక్ ఏంటబ్బా అని నెటిజన్లు ఆతృతగా క్లిక్ చేసి చూసి ఏప్రిల్ ఫూల్స్ అయ్యారు. ఈ ట్వీట్ కొన్ని గంటల్లోనే వైరలవడంతో పాటు నెటిజన్లు వినూత్నమైన ఏప్రిల్ ఫూల్ ట్వీట్ చేసిన చేతన్ భగత్ ను తెగ ప్రశంసిస్తున్నారు. రసహజంగానే కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు.