Begin typing your search above and press return to search.
చేవెళ్ల దిశ ఘటనలో పురోగతి
By: Tupaki Desk | 29 March 2020 7:30 AM GMTరాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చేవెళ్లలో దిశ ఘటనలాంటి మహిళా దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పురోగతి లభించింది. అయితే ఆమెపై అత్యాచారం చేయలేదని.. కేవలం హతమార్చారని తేలింది. చేవెళ్ల సమీపంలోని తంగిడిపల్లి బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రాథమిక ఆధారాల్లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడి కాగా.. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఈ కేసులో నిందితుడి ఆచూకీ లభించింది. మృతురాలు సిక్కిం రాష్ట్రానికి చెందిన మహిళ అని, నిందితుడు ముంబైకి చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు.
సిక్కింకు చెందిన మహిళ ముంబైలో కొద్ది రోజులు ఉండి హైదరాబాద్‌కు వచ్చింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంది. ఆమెకు పరిచయమున్న ఓ వ్యక్తి హైదరాబాద్‌కు వచ్చాడు. ఆమెతో కలిసి తిరిగాడు. ఆ క్రమంలో ఆమెతో అతడికి వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ క్షణికావేశంలో ఆమెను హతమార్చినట్లు గుర్తించారు. అయితే ఆ వ్యక్తి కారులో ఆమె మృతదేహంతో తిరిగి చివరకు చేవెళ్ల సమీపంలోని తంగిడిపల్లి బ్రిడ్జ వద్ద పారేసి వెళ్లాడు. అయితే ఆయన వాడిని కారు ఆధారంగా అతడిని పట్టుకున్నారు.
డ్రైవ్ ఈజీకి చెందిన కారును అద్దెకు తీసుకుని ఆయన తిరిగాడు. సీసీ కెమెరాల్లో ఆ కారు రెండు మూడు చోట్ల కనిపించడంతో పోలీసులు ఆ సంస్థను సంప్రదించి కారును తీసుకునేటప్పుడు అతడు ఇచ్చిన పత్రాల ఆధారంగా పట్టుకున్నారు. నిందితుడిని పట్టుకుని.. కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆమెకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఎందుకు చంపాడు? అతడు ఆమెకు ఏమవుతాడు? ఎక్కడా చంపాడు? అనే వివరాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడు అత్యాచారానికి పాల్పడలేదని తెలియడంతో కొంత ఉత్కంఠ వీడింది.