Begin typing your search above and press return to search.
సోషల్ మీడియాలో చెవిరెడ్డి ఆడియో వైరల్
By: Tupaki Desk | 19 April 2021 7:07 AM GMTతిరుపతి ఉప ఎన్నికల వేళ టీడీపీ, బీజేపీ నేతలు భారీగా దొంగ ఓట్లను, ఓటర్లను పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇతర జిల్లాల నుంచి జనాలను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించినట్టు ప్రచారం సాగుతోంది. కొందరు నేతల ఫోన్ కాల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరో వైసీపీ నేతతో దొంగ ఓటర్లను తరలించేందుకు బస్సులు ఏర్పాటు కోసం మాట్లాడినట్టు ఉన్న ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చెవిరెడ్డి మాట్లాడిందా? లేదా ఎవరైనా మార్ఫింగ్ చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఈ ఆడియో మాత్రం కలకలం సృష్టిస్తోంది.
ప్రజలను తరలించేందుకు 7 బస్సులు కాదని.. 12 బస్సులు కావాలని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆడియోలో మాట్లాడినట్టు ఉంది. ఒకరోజు ముందే దీనిపై ప్లాన్ చేయాలని సూచించారు. అదే రోజు వాళ్లను రెడీ చేయవద్దని.. ముందురోజు వాళ్లను రెడీ చేయాలని సూచించారు.
వైసీపీ నేతలే పక్కా ప్లాన్ తో ఈ దొంగ ఓట్లు వేయించారని బీజేపీ, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆడియోలపై ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా మిగతా నేతలు ఇంతవరకు స్పందించలేదు మరి ఈ ఆడియో నిజమైనదా? లేక నకిలీదా అన్నది తెలియాల్సి ఉంది.