Begin typing your search above and press return to search.
తాగుబోతుగా మారిపోయిన జంపింగ్ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 19 May 2016 12:28 PM GMTఎవరైనా ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఏం చేస్తాం? కాసేపు బాధపడతాం.. ఇక తర్వాత నుంచి జాగ్రత్త పడతాం! మరి రాజకీయాల్లో ఉన్నవారైతే ఏం చేస్తారు? ఎప్పుడు వేరే పార్టీలోకి వెళిపోదామా అని చూస్తారు! అయితే ఇక్కడో రాజకీయ నాయకుడికి పెద్ద చిక్కే వచ్చి పడింది. ఒక పార్టీలో ఆయనకు ఏమీ దక్కవని తెలిసి.. అధికార పార్టీలో చేరిపోయాడు! పార్టీలోకి వస్తే.. అందలమెక్కిస్తాం అని చెప్పారట. దీంతో ఆయన వెంటనే పార్టీ మారిపోయారు! పార్టీలో చేరి ఇన్ని రోజులైనా అసలు.. ఆ హామీల ఊసు ఎత్తకపోవడంతో పాపం ఏం చేయాలో తెలియక తెగ తాగేస్తున్నారట ఆ ఎమ్మెల్యే!
వైకాపా నుంచి టీడీపీలో చేరిన ఓ ఎమ్మెల్యే తాగుబోతయ్యారట! మంత్రి పదవి ఇస్తానని టీడీపీ మోసం చేయడంతో రాత్రనక - పగలనక తాగుతూనే ఉన్నారట! ఇంతకీ ఈ ఎమ్మెల్యే ఏ ప్రాంతానికి చెందినవారో మాత్రం ఆ పార్టీకి చెందిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పలేదు. జగన్ జలదీక్ష వేదికపై నుంచి మాట్లాడిన చెవిరెడ్డి.. “వైకాపాలో ఉన్నప్పుడు రాత్రి పూట మాత్రమే ఆ ఎమ్మెల్యే తాగేవాడు. మంత్రి పదవి ఇస్తామని ఆశచూపడంతో టీడీపీలో చేరాడు. రోజులు గడుస్తున్నా మంత్రి పదవి ఇవ్వకపోవడంతో 24 గంటలూ తాగుతూనే ఉన్నాడు“ అని చెవిరెడ్డి వివరించారు.
తమ పార్టీ వీడిపోతే ఎవరి పరిస్థితి అయినా ఇలాగే ఉంటుందని చెవిరెడ్డి దీన్ని ఓ ఉదాహరణగా చెప్పారట. అయితే టీడీపీలో చేరిన అందరికీ మంత్రి పదవి ఇస్తామని ఆశచూపలేదు. ఇద్దరు లేక ముగ్గురికి ఈ హామీ ఇచ్చారు. ఈ ముగ్గురిలో చెవిరెడ్డి చెప్పిన తాగుబోతైన ఎమ్మెల్యే ఎవరబ్బా? ఆ ఎమ్మెల్యే రాయలసీమ ముఖద్వారమైన జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అయి ఉండొచ్చని వైకాపా నేతలు ఆఫ్‌ది రికార్డ్‌గా చెబుతున్నారు.