Begin typing your search above and press return to search.
హిల్లరీ ఓటమికి చంద్రబాబు కారణమా?
By: Tupaki Desk | 11 Nov 2016 7:20 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓటమికి చంద్రబాబే కారణమా..? వినడానికి నవ్వుతెప్పించినా అందుకు చంద్రబాబును నిందించడంలో తప్పులేదంటున్నారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి. హిల్లరీ విజయానికి చంద్రబాబు కృష్టి చేస్తున్నారని ముందుగానే పచ్చమీడియా కథనాలు వండినప్పుడు ఆమె ఓటమికి కూడా చంద్రబాబును బాధ్యుణ్ని చేయాల్సి ఉంటుందంటున్నారు. ఏపీలో పరిస్థితుల కారణంగానే హిల్లరీ క్లింటన్ ఓటమిపాలైందని ఆయన ఆరోపించారు.
అంతర్జాతీయంగా ఘనత వహించిన మీడియా - సర్వే సంస్థలు కూడా హిల్లరీ గెలుపు ఖాయమని చెప్పాయని... అయినా ఆమె ఓడిపోయారంటే అందుకు చంద్రబాబే కారణమని చెవిరెడ్డి అంటున్నారు. ప్రపంచమంతా హిల్లరీ గెలుస్తుందని అంచనాకు రావడంతో వెంటనే చంద్రబాబు హిల్లరీకి మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. టీడీపీ ఎన్ ఆర్ ఐ లంతా హిల్లరీకే ఓటేయాలని చంద్రబాబు లేఖలు కూడా రాశారని చెప్పారు. అప్పటి నుంచే హిల్లరీ ఓటమికి దగ్గరయ్యారన్నారు. ఏపీలో నిరుద్యోగులు - మహిళలు - రైతులను మోసం చేయడం ద్వారా పాపాలు మూటకట్టుకున్నచంద్రబాబు మద్దతు ఇవ్వడం వల్లే హిల్లరీ అగాధంలోకి పడిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు కూడా ఇలాంటి ఓటమే తప్పదన్నారు.
చంద్రబాబు ఏకంగా హిల్లరీ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్తున్నానని ముందే ప్రకటించుకోవడం ద్వారా చంద్రబాబు అత్యుత్సాహం బయటపడిందని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాపాలు ఆయన కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు పరిచయమున్న నేతలందరికీ చుట్టుకుంటున్నాయన్నట్లుగా చెవిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/