Begin typing your search above and press return to search.

చెవిరెడ్డి అడిగిన ప్ర‌శ్న‌లో లాజిక్ ఉంది క‌దా?

By:  Tupaki Desk   |   10 Jun 2017 6:29 PM GMT
చెవిరెడ్డి అడిగిన ప్ర‌శ్న‌లో లాజిక్ ఉంది క‌దా?
X
ఉద్యోగుల‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ తనపై ఆరోపణలు చేస్తున్న వారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హితవుపలికారు. కొంద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగులు ఉద్దేశ‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీర‌ను ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌ని తెలిపారు. అయితే అలా అనైతిక చర్యలకు పాల్పడుతున్న అధికారులకు తిప్పలు తప్పవని స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ లో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గ అధికారులను ఇబ్బందులు పెడుతున్నట్లు ఏ ఒక్క ఉద్యోగితోనైనా చెప్పించండి అని ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి సవాలు విసిరారు. స్వప్రయోజనాల కోసం అధికారులను వాడుకుంటున్నానని చెప్పమనండి అని ఆరోపణలు చేసిన వారిపై విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నా.. ఉద్యోగులను సమర్థించాలా అని నిలదీశారు.

తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజకవర్గంలో పనిచేసే అధికారులు నిత్యం స్వేచ్ఛగా, నిజాయితీగా, సేవా ధృక్పదంతో పనిచేయాలని చెబుతుంటానని చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి స్పష్టం చేశారు. మీకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా కల్పించే వ్యక్తిత్వం తనదని అన్నారు. నియోజకవర్గంలో పనిచేసే కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐ వరకు తలారీ నుంచి తహసీల్దార్‌ వరకు, గ్రామ పంచాయతీ నుంచి ఎంపీడీఓ వరకు దాదాపు 2500 మంది ప్రభుత్వ ఉద్యోగులను తోబుట్టువులుగా భావించి ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున దుస్తుల పంపిణీ చేస్తానని తెలిపారు. కొందరు ఉద్యోగులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మా పార్టీకి ఓటేసిన ప్రజలను అధికారులు ఇబ్బందులకు గురిచేస్తుంటే ప్రశ్నించకూడదా అని ప్రశ్నించారు.

ప్ర‌స్తుతం త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న వారు వారి వ్య‌వ‌హార‌శైలి గురించి స‌మీక్షించుకోవాల‌ని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. తహసీల్దార్‌ వనజాక్షిపై అధికార పార్టీ ఎమ్మెల్యే దాడి చేసినప్పుడు ఈ ఉద్యోగ సంఘాలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. విజయవాడలో అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే సీనియర్‌ అధికారిపై దాడి చేసినప్పుడు ఉద్యోగ సంఘాలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో 90 శాతం మంది ఉద్యోగులు నిస్పక్షపాతంగా పనిచేస్తున్నారని, వారికి వైఎస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుందన్నారు. కానీ కొందరు టీడీపీ కార్యకర్తల్లా మారారని విమర్శించారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న అధికారులను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని చెవిరెడ్డి తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/