Begin typing your search above and press return to search.

బాబును చెవిరెడ్డి అన్న మాటేంది? ఇష్యూ ఏమైంది?

By:  Tupaki Desk   |   13 Jun 2019 11:02 AM GMT
బాబును చెవిరెడ్డి అన్న మాటేంది?  ఇష్యూ ఏమైంది?
X
అధికారం చేతిలో ఉన్న‌ప్పుడు ఉత్సాహం ఒకింత ఎక్కువ‌గానే ఉంటుంది. దీంతో.. నోటి నుంచి వ‌చ్చే మాట‌లు ఒక్కోసారి బ్యాలెన్స్ మిస్ అయ్యే అవ‌కాశం ఉంటుంది. తాజాగా అలాంటి పొర‌పాటునే చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత క‌మ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌. గురువారం నాటి ఏపీ అసెంబ్లీలో చెవిరెడ్డి నోటి నుంచి వ‌చ్చిన ఒక ప‌దం కొంత‌సేపు అధికార‌.. విప‌క్షం మ‌ధ్య ఉద్రిక్త‌త‌కు అవ‌కాశాన్ని ఇచ్చింది.

ఇంత‌కూ అస‌లేం జ‌రిగిందంటే.. స్పీక‌ర్ ఛైర్ వ‌ర‌కు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు రాకుండా బంట్రోతును పంపిన‌ట్లుగా చెబిరెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నిరస‌న‌కు దిగారు. దీంతో.. అధికార‌.. విప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం చెల‌రేగింది. ఒక‌పై ఒక‌రు మాట‌లు అనుకున్నారు.

ఈ వివాదంపై ప్ర‌భుత్వ చీఫ్ విప్ శ్రీ‌కాంత్ రెడ్డి మాట్లాడుతూ..చెవిరెడ్డి ఉద్దేశ్య‌పూర్వ‌కంగా మాట్లాడ‌లేద‌ని.. బంట్రోతుల్లా అనే ప‌దం వాడిన‌ట్లుగా చెప్పారు. ఇదిలా ఉంటే.. ఏపీ విప‌క్ష నేత చంద్ర‌బాబు ఈ ఉదంతంపై స్పందించారు. స్పీక‌ర్ ఎన్నిక అంశంలో త‌మ‌కు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా చెప్ప‌లేద‌న్న‌రు.

త‌న‌ను పిల‌వ‌కుండా స్పీక‌ర్ ఛైర్ వ‌ర‌కు తాను ఎలా వ‌స్తాన‌ని బాబు ప్ర‌శ్నించారు. కావాలంటే రికార్డులు చెక్ చేయాల‌ని స్పీక‌ర్ కు విన్నవించారు. స్పీక‌ర్ ఎన్నిక అనంత‌రం ఆయ‌న్ను తానెలా అభినందిస్తాన‌ని చెప్పారు. అందుకు త‌న‌కు బ‌దులుగా అచ్చెన్నాయుడును పంపిస్తే బంట్రోతు అంటూ అహంభావంతో వ్యాఖ్య‌లు చేస్తారా? అని ప్ర‌శ్నించారు.

గాయ‌ప‌డేలా మాట్లాడినందుకు సారీ చెప్పాల‌ని కోరారు. ఇలా ఒక‌రిపై ఒక‌రు నింద‌లు.. ఆరోప‌ణ‌లు చేసుకుంటూ వాతావ‌ర‌ణం అంత‌కంత‌కూ వేడెక్కేలా చేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.