Begin typing your search above and press return to search.

చెవిరెడ్డికి జ‌గ‌న్ ఇలా షాక్ ఇచ్చారేంటి...!

By:  Tupaki Desk   |   10 April 2022 11:36 AM GMT
చెవిరెడ్డికి జ‌గ‌న్ ఇలా షాక్ ఇచ్చారేంటి...!
X
వైసీపీలో ఉన్న అనేక మంది నాయ‌కుల‌లో ఆయ‌న చాలా డిఫ‌రెంట్. 150 మంది ఎమ్మెల్యే ఆయ‌న మరిం త డిఫ‌రెంట్. సీఎం జ‌గ‌న్ అన్నా.. ఆయ‌న పాల‌న అన్నా.. అమితమైన ప్రేమ‌. అంతేకాదు. ఇంట్లో మ‌నిషి మాదిరిగా.. చెవిరెడ్డి క‌లిసిపోయారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్న ఆయ‌న‌..పార్టీ అధినేత‌ జ‌గ‌న్ కోసం.. ఏదైనా చేసే నాయ‌కుడిగా.. వ్య‌వ‌హ‌రించారు. అలానే పేరు కూడా తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే కాల్ మ‌నీ వ్య‌వ‌హారానికి సంబంధించి టీడీపీ హ‌యాంలో తీవ్ర విమ‌ర్శ‌లు చేసి.. స‌స్పెండ్ కూడా అయ్యారు.

ఇక‌, జ‌గ‌న్‌ను సీఎంను చేసుకునేందుకు పాద‌యాత్ర చేశారు. జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత కూడా.. ఏ ప‌ద‌వినీ ఆశించ‌కుండా... ప‌నిచేస్తున్నారు. సీఎం జ‌గ‌న్ నివాసంలో పెద్ద పాల‌కుడిగా.. చెవిరెడ్డి వ్య‌వ‌హ‌రి స్తున్నార‌ని... ఆయ‌న అనుచ‌రులే చెప్పుకొంటున్నారు. అయితే.. ఎంతైనా.. సీనియ‌ర్ న‌నాయ‌కుడు.. మంచి వాయిస్ ఉన్న‌నాయ‌కుడు.. పైగా లా చ‌ద‌విన‌ నేత‌..కావ‌డంతో.. తాజాగా ఆయ‌న అనుచ‌రులు మంత్రి ప‌దవిపై ఆశ‌లు పెట్టుకున్నారు. ఇటీవ‌ల మంత్రి వ‌ర్గం రాజీనామా చేసిన త‌ర్వాత‌.. చంద్రగిరిలో పెద్ద ఎత్తున పోస్ట‌ర్లు వెలిశాయి.

`చెవిరెడ్డి అన్న కాబోయే మంత్రి` అని రాత్రికి రాత్రి ఫ్లెక్సీలు ద‌ర్శ‌న మిచ్చాయి. అయితే.. విష‌యం తెలి సిన చెవిరెడ్డి వెంట‌నే వాటిని ద‌గ్గరుండి మ‌రీ తీసేయించార‌ని స‌మాచారం. స‌రే.. ఇంత‌కీ.. చెవిరెడ్డి అనుచ‌రులు కోరుకుంటున్న విధంగా.. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌చ్చేనా..? అనేది ప్ర‌శ్న‌గా మారింది. ఈ ద‌ఫా కూడా చెవిరెడ్డికిమంత్రి యోగం లేద‌నే సంకేతాలు వ‌చ్చేశాయి. రెడ్డి ట్యాగ్ ప్ర‌ధానంగా ఆయ‌న‌ను ఇబ్బంది పెడుతోంది. పైగా.. జ‌గ‌న్ ఎంత చెబితే అంత వింటార‌నే పేరు కూడా ఉంది. అస‌మ్మ‌తి.. నిర‌స‌న వంటివి లేనేలేవు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ చెవిరెడ్డి కోర‌కుండానే.. మ‌రోసారి.. టీటీడీ బోర్డులో స‌భ్య‌త్వం ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు.. మంత్రి వ‌ర్గం కంటే ముందుగానే.. తుడా(తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ) బోర్డు చైర్మ‌న్‌గా మ‌రో రెండేళ్ల‌పాటు ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని పొడిగించారు. ఈ ప‌రిణ‌ణామాల‌ను చూస్తే.. చెవిరెడ్డికి మంత్రి వ‌ర్గంలో చోటు లేద‌ని సంకేతాలు ఇచ్చేసిన‌ట్టు అయింది.

కానీ, అనుచ‌రులు మాత్రం పెద‌వి విరుస్తున్నారు ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి వ‌చ్చిన‌న వారికి ప‌ద‌వులు ఇస్తూ.. అంకిత భావంతో ప‌నిచేస్తున్న వారిని అణ‌గ‌దొక్కుతున్నార‌ని అంటున్నారు.. కానీ, చెవిరెడ్డి మాత్రం జ‌గ‌న్ ఏ ప‌ప‌నిచేయ‌మంటే అదే చేస్తాన‌ని.. అంత‌కు మించి త‌న‌కు తెలిసింది ఏమీ లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. ఇది ఒక విధంగా మంచిదే అయినా... ఆయ‌న‌ను న‌మ్ముకున్న అనుచ‌రులు మాత్రం అసంతృప్తితో ఉండ‌డం గ‌మ‌నార్హం.