Begin typing your search above and press return to search.
నీ స్థాయి ఏంటని చెవిరెడ్డినే అడిగేశారు
By: Tupaki Desk | 28 March 2016 5:48 AM GMTఒక నాయకుడికి ఎలాంటి చేదు అనుభవం ఎదురుకాకూడదో అదే ఎదురైంది. తనకు సన్నిహితుడైన నేతకు చెందిన అనుచరులు అవమానకరంగా మాట్లాడటమే కాదు.. అధినేత మీద ఉన్న ఆగ్రహాన్ని తన మీద ప్రదర్శించటంతో తీవ్ర ఇబ్బందికి గురయ్యారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తిరుపతిలో తన హవా నడిపించే ఆయన.. తనకే మాత్రం పట్టు లేని జిల్లాలో మర్చిపోలేని చేదు ఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది.
పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రు ఏపీ అధికారపక్షంలోకి వెళ్లేందుకు సిద్ధం కావటంతో.. ఆయన్ను అనునయించేందుకు చెవిరెడ్డిని పంపారు అధినేత జగన్. ఇలాంటి సమయాల్లో ఎలాంటి అనుభవం తనకు ఎదురవుతుందో తెలీని చెవిరెడ్డి.. జ్యోతులతో తనకున్న సానిహిత్యంతో ఏదో చేయొచ్చని ఆయన సొంతూరు ఇర్రిపాకకు చేరుకున్నారు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా జ్యోతుల నెహ్రును కలిసేందుకు దాదాపు గంటన్నరకు పైగా వెయిట్ చేయించారు. అప్పటికి కానీ ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతి లభించలేదు.
ఇలాంటి పరిస్థితిని ఏ మాత్రం ఊహించని చెవిరెడ్డికి షాక్ తగిలితే.. లోపలకువెళ్లిన ఆయనకు మరో షాక్ తగిలింది. ఫ్రెండ్ షిప్ తో ఏదైనా మాట్లాడుకుందాం.. పాలిటిక్స్ తప్ప అంటూ తేల్చేయటంతో చెవిరెడ్డి గొంతు పెగల్లేదని చెబుతున్నారు. కాసేపు కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా జ్యోతుల నెహ్రు ససేమిరా అనటంతో.. ఆయన నిరాశగా వెనుదిరిగారు. నెహ్రు ఇంటి నుంచి బయటకు వచ్చిన చెవిరెడ్డిని నెహ్రూ అనుచరులు నిలదీసినంత పని చేశారు. అసలు నువ్వెందుకు వచ్చావ్ అంటూ ఏకవచనంలో మాట్లాడటమే కాదు.. జ్యోతులతో మాట్లాడే స్థాయి నీకు ఉందా? అని ప్రశ్నించటంతో చెవిరెడ్డికి షాక్ తగిలినంత పనైందట. ఇలాంటి అనుభవాన్ని ఏ మాత్రం ఊహించని ఆయన.. కామ్ గా వెనుదిరిగారట. ఏ రాజకీయ నేతకైనా ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితి మరింకేం ఉంటుంది..?