Begin typing your search above and press return to search.

బాబు..చినబాబు ఫ్లెక్సీల్ని చించేశారు

By:  Tupaki Desk   |   14 Jan 2017 6:46 AM GMT
బాబు..చినబాబు ఫ్లెక్సీల్ని చించేశారు
X
ఆరోపణల మాట ఎలా ఉన్నా.. ఫండగపూట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. యువనేత చినబాబుకు సొంత జిల్లాలో ఇబ్బందికరపరిస్థితి ఎదురైంది. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడా జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి రూరల్ లోని పుదిపట్ల గ్రామపంచాయితీలో మొదలైన ఫ్లెక్సీల రచ్చ అంతకంతకూ పెరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. ఆయన కుమారుడు లోకేశ్ బాబుకు స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన పెద్ద ఎత్తున భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆ ఫ్లెక్సీలను చించేయటం ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. అధికార.. విపక్ష నేతల మధ్య తీవ్ర ఉద్రిక్తల్ని రగిల్చేలా చేసింది. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు చించేసినట్లుగా టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. తమకీ గొడవలో అస్సలు సంబంధం లేదని.. ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.. చింపుకున్నది తెలుగుదేశానికి చెందిన వారేనని జగన్ పార్టీ నేతలు వాదిస్తున్నారు.

ఈ వివాదం ఇప్పుడు ఎంఆర్ పల్లె పోలీసు స్టేషన్ కు చేరింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరుకు వస్తున్న సీఎం చంద్రబాబుకు స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలను పుదిపుట్ల ఎంపీటీసీ బడి సుధాయాదవ్ ఏర్పాటు చేశారు. అయితే.. వీటిని స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు చించి వేస్తున్నవేళ.. టీడీపీ నేతలు పట్టుకున్నారు. ఫ్లెక్సీలను చించివేతలో జగన్ పార్టీకి చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో ఫ్లెక్సీలను చించివేసిన యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే.. తమ వాళ్లను అనవసరంగా అరెస్ట్ చేశారని.. సీఎం ఫ్లెక్సీలను చించివేయటంలో తమకు సంబంధం లేదని.. నిజానికి తమ పార్టీకి నేతలకు చెందిన కార్ల అధ్దాల్నిధ్వంసం చేయటమే కాదు.. ఫ్లెక్సీలను టీడీపీ వారే చించుకొని తమ మీద రివర్స్ కేసులు పెట్టినట్లుగా చెవిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు పోలీసులు ట్రై చేస్తున్నారు. ఏది ఏమైనా సంక్రాంతి పండగ సందర్భంగా సొంత జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు.. చినిగిపోయి ఫ్లెక్సీలు స్వాగతం చెప్పటం ఇబ్బందికర పరిణామంగా చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/