Begin typing your search above and press return to search.
జగన్ అభిమానుల్లో చెవిరెడ్డికి 'సరిలేరు ఇంకెవ్వరూ!'
By: Tupaki Desk | 21 Dec 2021 8:28 AM GMTవైసీపీ అధినేత, సీఎం జగన్ అంటే.. ఆ పార్టీ లో చాలా మందికి అభిమానం. రావాలి జగన్-కావాలి జగన్ అని కోరుకున్నవారు.. లక్షల్లోనే ఉన్నారు. అయితే.. వీరందరి లోకి ఆది నుంచి మరింత అభిమానం చాటుకున్న నాయకుడి గా పేరు తెచ్చుకున్నారు చంద్ర గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.
అటు అసెంబ్లీలో అయినా.. ఇటు.. బయట అయినా.. జగన్ పై ఒక్క మాట పడనివ్వరు. అంతే కాదు.. జగన్ ఏం చెప్పినా.. చేసే.. అపర హనుమంతుని టైపు అనుకోవచ్చు! పార్టీ కోసం కష్టపడడం.. జగన్ చెప్పింది చేయడం.. ఇచ్చింది తీసుకోవడం.. మినహా.. చెవిరెడ్డి.. ఇది కావాలి! అని అడిగింది లేదు.
అంతే కాదు.. అది ఇవ్వ లేదే! అని మూతి ముడుచుకున్నది అంత కన్నా.. లేదు. రాముడి కి హనుమ మాదిరి గా.. జగన్ కు చెవిరెడ్డి అలా! నిజానికి ఆయన చేసిన కృషి.. అసెంబ్లీలో గతం లో ఆయన పడిన వేదన.. ఫలితంగా ఆయన ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే.. మంత్రి పదవైనా ఇవ్వరా? అని మూతి మొత్తం ముడుచుకునేవారే! కానీ.. ఏనాడూ.. చెవిరెడ్డి పదవుల కోసం వెంటపడలేదు. పని పని పని.. అధినేత అధినేత.. అనే మాట తప్ప..పార్టీ లో పదవి కావాలని పట్టుకు వేలాడింది లేదు. ఎమ్మెల్యే అయినా.. తాను డౌన్ టు ఎర్త్.. అనే మాటను నిజం చేస్తారు.
ఒక్క పార్టీ లోనే కాదు.. ప్రజలకు కూడా.. పిలిస్తే పలికే నాయకుడి గా పేరు తెచ్చుకున్నారు. కరోనా సమయం లో ప్రజలను ఆయన ఆదుకున్న తీరు.. నభూతో అన్నవిధంగా సాగింది. ఎవరినీ అడకుండానే.. తన సొంత నిధుల తో లక్షల మంది ప్రజలకు ఆహారం పెట్టారు. లక్షల మంది కి కరోనా మందును ఉచితంగా పంచారు. ఇలా.. ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ.. వివాద రహిత నాయకుడిగా చెవిరెడ్డి వ్యవహ రించారు. తాజాగా జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని చెవిరెడ్డి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలి పారు.
తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయ ఆవరణ లో గోశాల ముందు భాగంలో ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ విధానంలో గ్రాస్ పై సీఎం వైఎస్ జగన్ ముఖ చిత్రాన్ని చక్కగా తీర్చిదిద్దించారు చెవిరెడ్డి. వంద అడుగుల పొడవు, వంద అడుగుల వెడల్పుతో 2డీ ఆర్కిటెక్చర్ టెక్నాలజీ తో దీన్ని రూపొందించారు. దేశం లోనే తొలి ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ గా చెబుతున్నారు.
ఈ ముఖ చిత్రాన్ని ప్రముఖ చిత్రకారుడు కాంత్ రీషా వేశా రు. ఇందు కోసం పది రోజుల సమయం పట్టినట్టు సమాచారం. తన నాయకుడి కి వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పేందుకు గత పది రోజులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడే ఉండి, స్వయం గా పర్యవేక్షించడం విశేషం.
ఇంతటి తో చెవిరెడ్డి ఆగ లేదు. సీఎం పై ‘అధిపతి’ టైటిల్ తో చక్కటి పాటను ఆవిష్కరింపజేశారు. ‘వర్థిల్లు.. వెయ్యేళ్లు’ పాట ఆడియో సీడీని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా చెవిరెడ్డి విడుదల చేశారు.
ఈ పాటను ఎం.కృష్ణవేణి రాయగా, ప్రముఖ సినీ గాయకుడు కారుణ్య ఆలపించారు. కార్తీక్ సంగీతం అందించారు. మొత్తానికి నేతల్లో నేతగా తాను కూడా కలిసి పోకుండా.. తనకంటే.. ప్రత్యేకతను చాటుకుంటున్న చెవిరెడ్డి జగన్ అభిమానాన్ని కొల్లగొట్టడం గమనార్హం.