Begin typing your search above and press return to search.
భారత్ మాట వింటే వణుకుతున్న డాన్
By: Tupaki Desk | 28 Oct 2015 9:12 AM GMTఅతగాడి నుంచి ఫోన్ వచ్చిందంటే పేరు మోసిన ప్రముఖులకు సైతం తడారిపోతుంది. సెలబ్రిటీలకైతే వణకు పుట్టే పరిస్థితి. తన ఫోన్ కాల్ తో ప్రపంచంలోని పలువుర్ని వణికించిన మాఫియా డాన్ కానీ పోలీసులకు పట్టుబడితే పరిస్థితి ఏమిటి? ప్రపంచంలోని పలు దేశాలకు సవాలుగా నిలిచిన మాఫియా డాన్ పోలీసులకు చిక్కినప్పుడు ఎలా వ్యవహరిస్తారన్నది తాజాగా ఇండోనేషియా బాలి పోలీసులకు పట్టబడిన మాఫియా డాన్ ఛోటా రాజన్ తీరు చూస్తే కాస్తంత ఆశ్చర్యం కలగక మానదు.
ఆస్ట్రేలియా నుంచి జింబాబ్వేకు పారిపోయేందుకు తాను ఇండోనేషియా వచ్చానని.. తనను కాని విడిచి పెడితే తాను జింబాబ్వేకు పారిపోతానని పోలీసుల్ని వేడుకుంటున్నాడట. తనను భారత్ కు అప్పగించొద్దని కోరుతున్నాడంటూ ఇండోనేషియా పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇండోనేషియా పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. భారత్ పేరు వింటనే ఛోటా రాజన్ భయపడిపోతున్నాడని.. భారత్ కు వెళ్లటానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదట. ఛోటారాజన్ ఎంత భయపడుతున్నాడని చెప్పటానికి అతని వ్యవహారశైలిని చూస్తేనే తెలుస్తుందని చెబుతున్నారు.
వరుస పెట్టి సిగిరెట్లు కాలుస్తున్నాడని.. తనకు భారత్ కు వెళ్లటం ఇష్టం లేదని చెబుతున్నాడని చెబుతున్నారు. భారత్ కు కానీ తాను వెళితే.. తన ప్రాణాలకు ముప్పు ఉందన్న భావన ఛోటా రాజన్ మాటల్లో వినిపిస్తోందన్న అభిప్రాయం ఉంది. ఛోటా రాజన్ ను భారత్ కు అప్పగించేందుకు ఇండోనేషియా సన్నాహాలు చేయటం.. అతడ్ని పట్టుకొని తీసుకొచ్చేందుకు భారత్ అధికారులు సిద్ధం అవుతున్నారు. ఎంత పెద్ద డాన్ అయినా.. చట్టానికి చిక్కితే మాత్రం చిగురుటాకులా వణికిపోవాల్సిందేనన్న మాట. చీకటి రాజ్యంలో రాజు వెలుతుర్ని తట్టుకోలేడు కదా?
మరో వైపు.. ఛోటా రాజన్ అరెస్ట్ తో ఆయన చీకటి వ్యాపారాల్ని చూసుకునేందుకు ఆయనకు కుడి భుజం లాంటి విక్కీ మల్హోత్రా చేతికి అప్పజెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. చోటా ఆశీస్సులతో బాస్ కానున్న విక్కీ.. తమ వైరి పక్షానికి చెందిన దావూద్ ఇబ్రహీంకు చెందిన డి గ్యాంగ్ కు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంకోవైపు విక్కీ కోసం భద్రతా దళాలు తీవ్రంగా వెతుకుతున్నాయి. మరి.. పోలీసులకు చిక్కకుండా తన బాస్ వ్యాపార సామ్రాజ్యాన్ని విక్కీ ఎంత మేరకు విస్తరిస్తారో..?